Zelensky Video | తమ స్వాతంత్య్రాన్ని కాపాడుకునేందుకు తమ దేశంలోనే ఉన్నామని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొడ్యమ్యిర్ జెలెన్‌స్కై ప్రకటించారు. రష్యా దండయాత్ర నుంచి తమను తాము కాపాడుకోవడానికి సిద్ధంగా ఉన్నామని తన సన్నిహిత మద్దతుదారులతో కలిసి శుక్రవారం రాత్రి సెల్ఫీ షార్ట్ వీడియో రిలీజ్ చేశారు.
మేం ఇక్కడే ఉన్నాం.. మా మిలిటరీ కూడా ఉంది. సమాజంలో పౌరులు ఇక్కడే ఉన్నారు. మా దేశ స్వాతంత్య్రాన్ని కాపాడుకునేందుకు మేం ఇక్కడే ఉన్నాం. ఈ మార్గంలోనే మేం పయనిస్తాం అని పేర్కొన్నారు. ఈ వీడియోను ప్రెసిడెన్షీ భవనం బయట నిలబడి విడుదల చేశారు.
ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను రష్యా సైన్యాలు అక్రమించుకున్నాయి. అంతకుముందే కీవ్ ఎయిర్‌పోర్ట్‌ను స్వాధీనం చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో జెలెన్‌స్కై దేశం విడిచి పారిపోయినట్లు వార్తలొచ్చాయి. కానీ, బాంబుల నుంచి రక్షణ కోసం జెలెన్‌స్కై.. బంకర్లలోకి వెళ్లినట్లు తెలుస్తున్నది.