వాషింగ్టన్: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుంచి సురక్షితంగా భూమికి తిరిగి వచ్చిన నలుగురు వ్యోమగాములకు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (NASA) స్వాగతం పలికింది. విజయవంతంగా యాత్రను పూర్తి చేసిన క్రూ-9 సిబ్బందికి అభినందనలు తెలిపింది. యాత్ర విజయవంతం కావడంలో స్పేస్ ఎక్స్ పాత్ర అద్భుతమని తెలిపింది. ప్రస్తుత పరిణామాలు భవిష్యత్ మానవసహిత అంతరిక్ష యాత్రకు కోత్తబాటలు చూపాయని పేర్కొంది. వ్యోమగాములు ఒక వ్యోమనౌకలో అంతరిక్షంలోకి వెళ్లి మరో వ్యోమనౌకలో సురక్షితంగా తిరిగొచ్చారు. భవిష్యత్ అంతరిక్ష ప్రయోగాలు, ప్రైవేటు భాగస్వాములకు ఇదొక సరికొత్త ప్రారంభమని వెల్లడించింది. భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్‌తో పాటు మరో ముగ్గురు ఆస్ట్రోనాట్స్ ఐఎస్ఎస్ నుంచి సుమారు 17 గంటలపాటు ప్రయాణించి బుధవారం తెల్లవారుజామున 3.27 గంటలకు అమెరికాలోని ఫ్లోరిడా తీర సముద్ర జలాల్లో సురక్షితంగా దిగారు. ఈ సందర్భంగా నాసా ఉన్నతాధికారులు మీడియాతో మాట్లాడుతూ..
‘వియవంతంగా యాత్రను పూర్తి చేసుకున్న క్రూ-9 సిబ్బందికి అభినందనలు. యాత్ర విజయంతం కావడంలో స్పేస్ ఎక్స్ది అద్భుత పాత్ర. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం శక్తిని అది చాటింది. క్యాప్సూల్ భూమిని చేరే సమయంలో వాతావరణం అనుకూలంగా ఉంది. ప్రశాంత వాతారణం వల్ల డ్రాగన్ క్యాప్సూల్ ల్యాండింగ్‌కు ఇబ్బంది ఎదురుకాలేదు. ల్యాండింగ్ సమయంలో భద్రతపరంగా అమెరికా కోస్ట్‌గార్డ్ అన్ని చర్యలు తీసుకున్నది. అన్‌డాకింగ్ నుంచి స్టాప్ ల్యాండింగ్ వరకు అన్నీ అనుకున్నట్లు జరిగాయి. ప్రస్తుత పరిణామాలు భవిష్యత్ మానవసహిత అంతరిక్ష యాత్రకు కొత్తబాటలు చూపాయి. ఒక వ్యోమనౌకలో అంతరిక్షంలోకి వెళ్లి మరో వ్యోమనౌకలో సురక్షితంగా తిరిగొచ్చారు. భవిష్యత్ అంతరిక్ష ప్రయోగాలు, ప్రైవేటు భాగస్వాములకు ఇదొక సరికొత్త ప్రారంభం. ఈ యాత్రలో సునీతా విలియమ్స్ రెండుసార్లు స్పేస్ వాక్ చేశారు. క్రూ-9 వ్యోమగాములు 150కిపైగా ప్రయోగాలు నిర్వహించారు. ఐఎస్ఎస్లో వ్యోమగాములు స్టెమ్‌సెల్స్ సాంకేతికతపై పరిశోధనలు చేశారు. క్యాన్సర్లకు పరిష్కారాలు చూపే మార్గాలపైనా పరిశోధనలు చేశారు. నలుగురు వ్యోమగాముల కృషి, పరిశోధనలు భవిష్యత్‌కు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి. సునిత, విల్మోర్లు ఐఎస్ఎస్ బయట కొన్ని నమూనాలను సేకరించారు. భవిష్యత్‌లో నాసా మరెన్నో ప్రయోగాలు, పరిశోధనలు చేపట్టబోతున్నది’ అని చెప్పారు.
Welcome home, #Crew9@NASA_Astronauts Nick Hague, Suni Williams, Butch Wilmore, and cosmonaut Aleksandr Gorbunov splashed down off the coast of Florida at 5:57pm ET (2127 UTC), concluding their scientific mission to the @Space_Station: https://t.co/DFWxQIiz6O pic.twitter.com/VQu3DhpTUJ
— NASA (@NASA) March 19, 2025