లండన్: ఈ సృష్టిలో ముందు సూర్యుడు ఏర్పడ్డాడని, సూర్యుడు ఏర్పడుతున్నప్పుడు దాని చుట్టు లక్ష్యం లేకుండా తిరుగుతున్న పదార్థం నుంచే భూమి సహా ప్రతి గ్రహం ఏర్పడిందనేది ఇప్పటివరకు శాస్త్రవేత్తలు చెప్తున్న మాట. అయితే, సూర్యుడి కంటే ముందే నీరు ఉండవచ్చని తాజాగా కొందరు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. యూరోపియన్ సౌత్ అబ్జర్వేటరీకి చెందిన శాస్త్రవేత్తలు వీ883 ఓరియోనిస్ అనే నక్షత్రం చుట్టు గ్రహం ఏర్పడే డిస్క్పై అధ్యయనం చేసి సూర్యుడి ఏర్పాటుకు ముందే, బిలియన్ల సంవత్సరాల క్రితమే గ్రహ వ్యవస్థల్లోనీరు ఉందని అంచనా వేశారు.