Mark Rutt | నెదర్లాండ్స్ మాజీ ప్రధాని మార్క్ రుట్టే నిరాడంబరతకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయి. 2010లో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన రుట్టే 14 ఏండ్ల పాటు పదవిలో కొనసాగారు.
తాజాగా నెదర్లాండ్స్ కొత్త ప్రధానిగా డిక్ స్కూఫ్ ఎన్నికయ్యారు. దీంతో మార్క్ రుట్టే.. కొత్త ప్రధానికి సంతోషంగా పదవీ బాధ్యతలు అప్పగించారు. తన అధికార నివాసాన్ని ఖాళీ చేసి సాధారణ పౌరుడిలా ఒక సైకిల్ తొక్కుకుంటూ, సిబ్బందికి వీడ్కోలు చెబుతూ తన సొంతింటికి వెళ్లిపోయారు.