న్యూఢిల్లీ : ఇండోనేషియాలోని లెవోటోబీ లకి లకి అగ్నిపర్వతం సోమవారం అర్ధరాత్రి బద్దలైంది. బూడిద దాదాపు 2,000 మీటర్ల ఎత్తు వరకు ఎగసిపడింది. సమీపంలో ఉన్న ఓ గ్రామంలోని ఆరు ఇండ్లు కాలిపోయాయి. 10 మంది ప్రాణాలు కోల్పోయారు. కూలిపోయిన ఇండ్ల కింద చాలా మంది చిక్కుకున్నారని స్థానిక మీడియా చెప్పింది. గత వారం నుంచి ఈ పర్వతంలో పేలుళ్లు సంభవిస్తున్నాయి. దీని వల్ల 10 వేల మంది ప్రజలు ప్రభావితులయ్యారని అధికారులు చెప్పారు. అగ్నిపర్వతం శిథిలాలు 6 కి.మీ. పరిధిలో చెల్లాచెదురుగా పడినట్లు తెలిపారు. ప్రజలు భయాందోళనలతో పరుగులు తీశారన్నారు.