మాస్కో: రష్యా అధ్యక్షుడు పుతిన్ స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. ఇటీవల ఆయన చుట్టూ ఉన్న వారిలో కొందరికి కరోనా సోకిందని, అందుకే గృహ నిర్బంధంలోకి వెళ్లారని రష్యా అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ చెప్పారు. పుతిన్‌కు వైద్య పరీక్షలు నిర్వహించగా నెగెటివ్‌గా తేలిందని, అయినా కొన్ని రోజులపాటు గృహనిర్బంధంలో ఉండాలని ఆయన నిర్ణయించుకున్నారని తెలిపారు. ఇంటి నుంచే విధులు నిర్వహిస్తారని చెప్పారు.ర