న్యూఢిల్లీ: అమెరికా దేశాధ్యక్ష ఎన్నికల్లో భారత్‌కు చెందిన వివేక్ రామస్వామి(Vivek Ramaswamy) రిపబ్లికన్ పార్టీ తరపున పోటీపడేందుకు ఆసక్తిగా ఉన్నారు. ఆ పార్టీ అభ్యర్ధిత్వం కోసం ఆయన ప్రచారం కూడా మొదలుపెట్టారు. అయితే వివేక్ రామస్వామిపై బిలియనీర్ ఎలన్ మస్క్(Elon Musk) ప్రశంసలు కురిపించారు. ఎక్స్ సోషల్ మీడియా అకౌంట్లో వివేక్‌కు చెందిన ఓ వీడియోను ఆయన పోస్టు చేశారు. ఫాక్స్ న్యూస్ యాంకర్ టక్కర్ కార్ల్సన్తో జరిగిన సంభాషణను ఆ వీడియోలో అప్లోడ్ చేశారు. వివేక్ రామస్వామి చాలా ప్రామిసింగ్ ఉన్నట్లు మస్క్ తెలిపారు. 37 ఏళ్ల రామస్వామి.. రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిగా పోటీపడేందుకు ఆసక్తిగా ఉన్నారని, ఈ అభ్యర్థి విశ్వసనీయంగా కనిపిస్తున్నట్లు మస్క్ తన ఎక్స్ అకౌంట్లో పేర్కొన్నారు.
వివేక్ రామస్వామి.. హార్వర్డ్, యేల్ యూనివర్సిటీల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. కేరళకు చెందిన భారతీయ జంటకు ఆయన జన్మించారు. చైనా తమ ఎజెండాను ముందుకు తీసుకువెళ్లేందుకు అమెరికా వ్యాపారవేత్తలను వాడుకుంటున్నట్లు రామస్వామి ఆరోపించారు.
గతంలో డోనాల్డ్ ట్రంప్ ప్రత్యర్థిగా పోటీ చేసిన రాన్ డీసాంటిస్కు ఎలన్ మస్క్ మద్దతు ఇచ్చారు. వివేక్ రామస్వామితో పాటు భారత మూలాలు ఉన్న నిక్కీ హేలీ, హర్ష వర్దన్ సింగ్.. రిపబ్లికన్ పార్టీ తరపున డోనాల్డ్ ట్రంప్‌కు పోటీగా అధ్యక్ష ఎన్నికల కోసం ప్రిపేరవుతున్నారు.
He is a very promising candidate https://t.co/bEQU8L21nd
— Elon Musk (@elonmusk) August 17, 2023