వాషింగ్టన్, నవంబర్ 15: వైద్య వృత్తిలో ఉన్న వారు తప్ప మిగిలిన అన్ని విభాగాల్లో హెచ్-1బీ వీసాలను తొలగించాలని ప్రతిపాదిస్తూ రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యురాలు మార్జోరీ టేలర్ గ్రీన్స్ ప్రవేశ పెట్టనున్న బిల్లును వాషింగ్టన్కు చెందిన ప్రముఖ ఇమ్మిగ్రేషన్ నిపుణురాలు సారా పియర్స్ తీవ్రంగా విమర్శించారు. ఇది అమెరికన్లను బాధ పెట్టడానికి అత్యంత సమర్ధంగా పనిచేసే మార్గమని, దీనివల్ల నివారించదగ్గ మరణాలు పెరుగుతాయని ఆమె అన్నారు. ప్రస్తుతం ఏటా మంజూరు చేసే 85 వేల హెచ్-1బీ వీసాలకు బదులుగా 10 వేలను మాత్రమే ఇవ్వాలంటూ తాను కొత్త బిల్లులో ప్రతపాదిస్తున్నట్టు టేలర్ గ్రీన్స్ పేర్కొనడాన్ని సారా పియర్స్ ప్రస్తావిస్తూ ‘ప్రస్తుతం ఏకపక్షంగా 10 వేల వీసా పరిమితిని అనుమతించే దాని కంటే ఎక్కువ మంది వైద్య నిపుణులు హెచ్-1బీ వీసా కింద వస్తున్నారు. ఈ ప్రతిపాదిత బిల్లు యూఎస్‌లో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వైద్యుల సంఖ్యను గణనీయంగా తగ్గిస్తుంది. తద్వారా నివారించ దగిన మరణాలకు అది దారి తీస్తుందని’ ఆమె పేర్కొన్నారు.
దుర్వినియోగం ఆపడానికి ఇది మొదటి అడుగు
హెచ్-1బీ వీసా దరఖాస్తు ఫీజును అనూహ్యంగా లక్ష డాలర్లకు పెంచడాన్ని అమెరికా పూర్తిగా సమర్థించుకుం ది. ఈ వ్యవస్థలోని దుర్వినియోగాన్ని ఆపడానికి ఇది ఒక ముఖ్యమైన మొద టి అడుగు అని వైట్‌హౌస్ అధికార ప్రతినిధి టేలర్ రోగర్స్ తెలిపారు. హెచ్-1బీ పేరుతో చవక కార్మిక శక్తిని తీసుకువచ్చి అమెరికన్ల స్థానాన్ని వారి తోఇకపై భర్తీచేయలేరని స్పష్టం చేశారు.