న్యూయార్క్: ఎవరైనా గొడవ పడతున్నప్పుడు ఒకరిద్దరు విపరీత మనస్తత్వం కలిగిన వాళ్లు ఎంజాయ్ చేసినా.. ఎక్కువ మంది మాత్రం బాధ పడుతారు. కానీ కొన్ని రకాల గొడవలు మాత్రం అందరికీ నవ్వు తెప్పిస్తాయి. తాజాగా అలాంటి గొడవే న్యూయార్క్‌లోని గ్రాండ్ సెంట్రల్ రైల్వే స్టేషన్లో జరిగింది. స్టేషన్‌లోని ఎస్కలేటర్‌పై వెళ్తుండగా ఇద్దరు ప్రయాణికుల మధ్య గొడవ రాజుకుంది.
ఈ గొడవకు సంబంధించిన దృశ్యాలను మరో ప్రయాణికుడు తన మొబైల్ రికార్డు చేశాడు. ఈ వీడియోను రెడ్డిట్‌లో పోస్టు చేయగా వైరల్ అయ్యింది. ఇంతకూ ఆ వీడియోలో ఏమున్నదంటే.. ఎస్కలేటర్‌పై ఉన్న ఇద్దరు వ్యక్తులు ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకుంటూ మెట్లపై పడిపోయారు. అయినా వారు గొడవ ఆపలేదు. మెట్లపై దొర్లుకుంటూనే కొట్లాడుకున్నారు.
ఒకవైపు వాళ్లు గొడవపడుతుంటే ఆ ఎస్కలేటర్‌పై వెళ్తున్న మిగతా ప్రయాణికులు వారికి దూరం జరిగి వెళ్లిపోయారు. కానీ, ఓ ప్రయాణికుడు మాత్రం చివరిమెట్టుపై ఉన్న వాళ్లను ఎస్కలేటర్ బయటకు పంపే ప్రయత్నంలో కాళ్లతో తన్నాడు. మరో మహిళ వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేసింది. ఈ నెల 14 నాటి ఘటనకు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటికే వెయ్యిల మంది వీక్షించారు. 1300 మందికిపైగా లైక్ చేశారు. మీరూ ఓ లుక్కేయండి..