ప్రియురాలికి ప్రపోజ్ చెయ్యడం అనేది ప్రేమికుల జీవితంలో మధురక్షణం. ఈ క్షణాలను కెమెరాలో బంధించుకోవాలని ఎన్నో జంటలు అనుకుంటాయి. కానీ ఒక్కోసారి మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం మాత్రం సరిగా ఉండదు. తాజాగా నెట్టింట ప్రత్యక్షమైన ఒక వీడియో చూస్తే ఇది నిజమే అనిపిస్తుంది. వీడియోలో ఒక జంట బీచ్‌కు వస్తుంది.
వారితోపాటు ప్రేయసి చెల్లి కూడా కెమెరా పట్టుకొని వచ్చింది. బాయ్‌ఫ్రెండ్ తన అక్కకు ప్రపోజ్ చేసే సీన్‌ను కెమెరాలో బంధించడం ఆమె డ్యూటీ. అయితే బీచ్‌లో ఉన్న ఒక రాయిపై కాలు పడటంతో ఆమె కింద పడిపోయింది. ఈలోపు జేబులో నుంచి ఉంగరం తీసిన బాయ్‌ఫ్రెండ్.. ప్రపోజ్ చేసేయడం ప్రారంభించాడు.
దాంతో వెంటనే లేచి నిలబడేందుకు ప్రయత్నించి మళ్లీ బొక్కబోర్లా పడిపోయింది. మళ్లీ లేవలేక అలాగే కింద కూర్చొని కెమెరాను అక్క, బావల వైపు తిప్పింది. కానీ అప్పటికే ప్రపోజ్ చేయడం పూర్తయిపోయింది. మే నెలలో ఈ వీడియోను సౌతాఫ్రికాలో తీసినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఇది నెట్టింట వైరల్ అవుతోంది.