ఆకాశంలో కారుమబ్బులు కమ్ముకోవడం మనకు కొత్తేం కాదు. భారీ వర్షాలు పడే ముందు ప్రతిసారీ ఇలా మేఘాలు కనిపిస్తూనే ఉంటాయి. కానీ తాజాగా నెట్టింట వైరల్ అవుతున్న వీడియోలోని మేఘాలు చూస్తే గుండె గుభేలుమంటుంది. అక్కడ ఉన్న ఊరిని ముంచేయాలనే కసితో మేఘాలు కదులుతున్నాయా? అనిపిస్తుంది.
ఈ ఘటనకు సంబంధించిన టైం ల్యాప్స్ వీడియోను నేచర్4వరల్డ్ అనే పేరున్న రెడిట్ ఖాతాలో షేర్ చేశారు. ఇది చూసిన నెటిజన్లు షాకైపోయారు. మరొక యూజర్ దీన్ని చూసి ‘అందుకే అనుకుంటా పూర్వీకులు ఇంద్రుడు అందరి కన్నా శక్తిమంతమైన దేవుడు అనేవారు’ అని కామెంట్ చేశాడు. ‘దీన్ని క్లౌడ్ బరస్ట్ అంటారు. ఇది పర్వతాల వద్ద జరిగితే కొండ చరియలు విరగిపడటం, భారీ తుఫానులు తప్పవు’ అని మరొక యూజర్ వివరించాడు.