సనా: భూమి మీద అసలు వర్షమే పడని ఓ గ్రామం ఉందంటే నమ్మగలరా? అయితే ఇది నిజం. యెమెన్‌లోని అల్ హుతైబ్ అనే గ్రామంలో ఇప్పటివరకూ వాన పడలేదు. భూ ఉపరితలం నుంచి 3,200 మీటర్ల ఎత్తులో ఓ కొండపై ఈ గ్రామం ఉంటుంది. ఎత్తయిన కొండపై ‘అల్ హుతైబ్’ ఉండడం వల్ల మేఘాలన్నీ ఈ ఊరు కిందుగా వెళుతుంటాయి. అందుకే ఈ ఊరి మీద వర్షం కురవదని శాస్త్రవేత్తలు తెలిపారు. వర్షం పడకపోతే, గ్రామస్తులకు ఇబ్బంది ఉండదా అనే సందేహం రావొచ్చు. అలాంటిదేమీ లేదు. ఈ కొండ కిందనే పంట పొలాలు ఉన్నాయి. కొండపైనున్న గ్రామస్తుల నీటి అవసరాలకు ప్రభు త్వం వాహనాల ద్వారా మంచినీటిని చేరవేస్తున్నది.