Winter | రాచరికం సినిమాతో డైరెక్టర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సురేష్ లంకలపల్లి. ఈ చిత్రం మంచి టాక్ తెచ్చుకుంది. కాగా ఈ టాలెంటెడ్ డైరెక్టర్ క్రేజీ టైటిల్‌తో కొత్త సినిమాను లాంచ్ చేశాడు. కశ్మీర్లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా రాబోతున్న ఈ సినిమాకు ‘వింటర్’ టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ చిత్రానికి సురేశ్ లంకలపల్లి కథ, స్క్రీన్‌ప్లే కూడా అందిస్తున్నాడు.
రిజ్వాన్ అలీ, రామ్, ఆదిత్య సూరజ్ సింగ్, కుసుమ చందక, శశికళ, శ్రీజిత, శ్రీజిత ఘోష్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని క్రిసెంట్ సినిమాస్, టీఎస్ఆర్ మేకర్స్ బ్యానర్లపై రియాజ్ అహ్మద్, టీ శ్రీనివాస రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇంతకీ వింటర్ మూవీలో డైరక్టర్ ఎలాంటి ఘటనలను చూపించబోతున్నాడన్నది ఆసక్తికరంగా మారింది.
Read Also :
Sequels Trend | టాలీవుడ్లో సీక్వెల్స్ ట్రెండ్ జోరు… పార్ట్ 2, పార్ట్ 3లతో రాబోతున్న భారీ సినిమాలు!
Aamir khan | గాలిపటం ఎగరేసిన అమీర్ ఖాన్.. ఇంతకీ ఎక్కడో తెలుసా..?