DCW vs GGW | నందిని హ్యాట్రిక్ మిస్.. 4 బిగ్ వికెట్లు కోల్పోయిన గుజరాత్..!
DCW vs GGW : మహిళల ప్రీమియర్ లీగ్‌లో ఎలిమినేటర్ మ్యాచ్‌లో నందిని శర్మ (2-10) నిప్పులు చెరుగుతోంది. పవర్ ప్లే చివరి ఓవర్ వేసిన నందిని రెండు వికెట్లతో గుజరాత్‌ను దెబ్బకొట్టింది.
DCW vs GGW : మహిళల ప్రీమియర్ లీగ్‌లో ఎలిమినేటర్ మ్యాచ్‌లో నందిని శర్మ (2-10) నిప్పులు చెరుగుతోంది. పవర్ ప్లే చివరి ఓవర్ వేసిన నందిని తొలి బంతికే అనుష్క శర్మ(16)ను ఔట్ చేసిన తను.. ఆ తర్వాత బంతికే కెప్టెన్ అష్లీ గార్డ్నర్(0)ను డకౌట్‌గా పెవిలియన్ పంపింది. వరుస బంతుల్లో రెండు బిగ్ వికెట్లు తీసిన నందిని మూడో బంతి వైడ్ వేయడంతో హ్యాట్రిక్ చేజార్చుకుంది. పవర్ ప్లేలో గుజరాత్ 48 పరుగులు చేసింది.
లీగ్ దశలో రెండుసార్లు గుజరాత్ చేతిలో కంగుతిన్న ఢిల్లీ క్యాపిటల్స్ ఎలిమినేటర్‌లో జోరు చూపిస్తోంది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీకి రెండో ఓవర్లోనే చిన్నెల్లీ బ్రేకిచ్చింది. డేంజరస్ సోఫీ డెవినె(6)ను ఆడిన బంతిని కీపర్ లిజెల్లీ ఒంటిచేత్తో అందుకుంది. ఆ షాక్ నుంచి తేరుకునేలోపే నందిని శర్మ(2-10) వరుస ఓవర్లలో అనుష్క శర్మ(16), అష్లీ గార్డ్నర్(0)లను వెనక్కి పంపింది.
I.C.Y.M.I
That’s how Nandni Sharma started her spell tonight 😎
Backed brilliantly by the #DC fielders 👏
Updates ▶️ https://t.co/seGdvpFWwh #TATAWPL | #ClaimTheCrown | #GGvDC | #Eliminator | @DelhiCapitals pic.twitter.com/SG4dVX2rPw
— Women’s Premier League (WPL) (@wplt20) February 3, 2026
అనుష్క ఆడిన బంతిని డైవ్ చేసి హెన్రీ అందుకోగా.. ఆ తర్వాత బంతికి గార్డ్నర్ స్లిప్‌లో స్నేహ్ రానా చేతికి చిక్కింది. దాంతో.. 38కే గుజరాత్ మూడు కీలక వికెట్లు కోల్పోయింది. బేత్ మూనీ(20 నాటౌట్)తో 21 రన్స్ జోడించిన కనికా ఆహుజా(6) మిన్ను మణి ఓవర్లో స్టంపౌట్ కావడంతో.. 59కే నాలుగు వికెట్లు పడ్డాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

