కాబూల్: ఆఫ్ఘనిస్థాన్( Afghanistan ) మరోసారి తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోయిందని ప్రపంచమంతా ఆందోళనగా ఉంది. ఆ రాక్షస పాలనలో ఉండలేమంటూ వేలాది మంది ఆఫ్ఘన్లు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని దేశం వదిలి వెళ్లిపోతున్నారు. దేశమంతా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే తాలిబన్లకు మాత్రం ఇవేమీ పట్టడం లేదు. దేశాన్ని గెలిచామన్న ఉత్సాహంలో ఉన్న వాళ్లు.. కాబూల్లో మస్త్ మజా చేస్తున్నారు. ఐస్క్రీమ్లు తింటూ.. అమ్యూజ్మెంట్ పార్క్లో ఆటలాడుతూ.. జిమ్లో కసరత్తులు చేస్తూ ఎంతో ఉల్లాసంగా గడుపుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
విమానాల్లోకి ఎలాగోలా ఎక్కి దేశం విడిచి వెళ్లడానికి ఆఫ్ఘన్లు పడుతున్న పాట్లకు సంబంధించిన వీడియోలు ఓవైపు ప్రపంచాన్ని కంటతడి పెట్టిస్తుంటే.. మరోవైపు తాలిబన్లు ఎంజాయ్ చేస్తున్న ఈ వీడియోలు వారిపై మరిన్ని ఆగ్రహావేశాలు వెల్లువెత్తేలా చేస్తున్నాయి.
A group of Taliban enters the amusement park in Kabul pic.twitter.com/a7943ly7SZ
— Ches (@jesang_) August 17, 2021
Taliban preparing for the PARIS OLYMPICS… pic.twitter.com/dMJI1E9QDm
— Dr. Ashish Belwal (@drsuperstar1680) August 17, 2021