WHO:చైనాలో కోవిడ్ పరిస్థితిపై డబ్ల్యూహెచ్వో ఆందోళన
WHO Chief Tedros చైనాలో అనూహ్య రీతిలో పెరుగుతున్న కరోనా కేసుల పట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. అవసరమైన వారికి త్వరగా ఆ దేశం వ్యాక్సిన్ ఇవ్వాలని డబ్ల్యూహెచ్వో కోరింది. చైనాలో తీవ్రమైన కరోనా కేసులు నమోదు కావడం ఆందోళనకరమే అని డబ్ల్యూహెచ్వో చీఫ్ టెడ్రోస్ అథనమ్ గెబ్రియాసిస్ తెలిపారు. అయి
జెనీవా: చైనాలో అనూహ్య రీతిలో పెరుగుతున్న కరోనా కేసుల పట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. అవసరమైన వారికి త్వరగా ఆ దేశం వ్యాక్సిన్ ఇవ్వాలని డబ్ల్యూహెచ్వో కోరింది. చైనాలో తీవ్రమైన కరోనా కేసులు నమోదు కావడం ఆందోళనకరమే అని డబ్ల్యూహెచ్వో చీఫ్ టెడ్రోస్ అథనమ్ గెబ్రియాసిస్ తెలిపారు. అయితే ఏ స్థాయిలో వ్యాధి తీవ్రత ఉన్నదో ఆ దేశం వెల్లడించాలని టెడ్రోస్ కోరారు. హాస్పిటళ్లలో జరుగుతున్న అడ్మిషన్లు, ఇంటెన్సివ్ కేర్ అవసరాల గురించి డ్రాగన్ దేశం వెల్లడించాలని ఆయన తెలిపారు.
వ్యాక్సిన్ ప్రక్రియపై ఫోకస్ చేసే రీతిలో చైనాకు మద్దతు ఇస్తున్నట్లు టెడ్రోస్ చెప్పారు. ఆ దేశ ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. దాదాపు 2020 నుంచి జీరో కోవిడ్ పాలసీలో భాగంగా కఠిన ఆరోగ్య ఆంక్షలను చైనా అమలు చేస్తోంది. కానీ ఇటీవల నిరసనలు వెల్లువెత్తడంతో ఆ ఆంక్షలను ఎత్తివేసిన విషయం తెలిసిందే.
"WHO is supporting #China to focus its efforts on vaccinating people at the highest risk across the country, and we continue to offer our support for clinical care and protecting its health system"-@DrTedros #COVID19
— World Health Organization (WHO) (@WHO) December 21, 2022
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

