టొరొంటో, ఏప్రిల్ 30: విదేశీ విద్యార్థుల పని గంటలకు సంబంధించి కెనడా కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. విదేశీ విద్యార్థులు కొత్త విద్యా సంవత్సరం మొదలయ్యే సెప్టెంబర్ 1 నుంచి క్యాంపస్ వెలుపల వారానికి గరిష్ఠంగా 24 గంటల వరకు మాత్రమే పనిచేసుకునేందుకు అవకాశం ఉంటుంది.
‘విద్యార్థులు క్యాంపస్ వెలుపల వారానికి 20 గంటలకు మించి పనిచేయడానికి అనుమతించే తాత్కాలిక విధానం ఏప్రిల్ 30తో ముగిసింది. ఈ పాలసీని పొడగించటం లేదు’ అంటూ కెనడా మంత్రి మార్క్ మిల్లర్ తాజాగా వెల్లడించారు. వారానికి పనిగంటల పరిమితిని 24 గంటలకు మార్చినట్టు తెలిపారు. విదేశీ విద్యార్థుల స్టూడెంట్ డిపాజిట్‌ను కెనడా ఇటీవలే భారీగా పెంచిన విషయం తెలిసిందే.