పారిస్: ఇరాన్ వార్‌కు ముగింపు పలుకుతూ ట్రంప్ ఓ ఒప్పందంపై సంతకం చేసిన విషయం తెలిసిందే. ఫ్రాన్స్ రాజధాని పారిస్ సమీపంలో ఉన్న వర్సైలిస్ ప్యాలెస్‌లో ఆ ఈవెంట్ జరిగింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రన్ సమక్షంలో .. ఇరాన్‌తో డీల్ అంశంలో ట్రంప్ సంతకం చేశారు. అయితే ఆ ఒప్పందాన్ని ఇస్లామాబాద్ ఎంవోయూగా పిలుస్తున్నారు. ఇక ట్రంప్ ఈవెంట్‌కు వేదికగా నిలిచిన వర్సైలిస్ ప్యాలెస్ .. ఒకప్పటి రాజభవనం. ఫ్రెంచ్ రాచరిక వైభవానికి ఆ ప్యాలెస్ ఓ సాక్ష్యంగా నిలుస్తోంది. అయితే ఆ అద్భుతమైన కట్టడం గతంలో కూడా పలు కీలక సమావేశాలకు వేదికగా నిలిచింది.
అంతర్జాతీయంగా దౌత్యపరమైన, రాజకీయ అగ్రిమెంట్లు ఆ ప్యాలెస్‌లో జరిగాయి. మొదటి ప్రపంచ యుద్ధం ముగింపునకు ఈ అద్దాల భవనమే సాక్షీగా నిలిచింది. ఆ నాటి వర్సైలిస్ ఒప్పందం ఇక్కడే కుదిరింది. జర్మనీ.. ప్రత్యర్థి దేశాల కూటమి మధ్య మొదటి ప్రపంచ యుద్ధం ముగింపు కోసం వర్సైలిస్ ఒప్పందాన్ని 1919, జూన్ 28వ తేదీన కుదుర్చుకున్నారు. అమెరికన్ రెవల్యూషనరీ వార్, ఫ్రాంకో ప్రుష్యన్ వార్ లాంటి అంతర్యుద్ధాలను ఆపేందుకు ఈ ప్యాలెస్‌లో దౌత్యపరమైన చర్చలు జరిగాయి.