Big Beautiful Bill | అమెరికాలో ట్రంప్ (Donald Trump) యంత్రాంగం తీసుకొచ్చిన వివాదాస్పద ‘బిగ్ బ్యూటిఫుల్ బిల్లు’ (Big Beautiful Bill)కు సెనేట్‌లో తుది ఆమోదం (US Senate Approves ) లభించింది. పన్నుల కోత, ప్రభుత్వ వ్యయానికి సంబంధించి తీసుకొచ్చిన 1000 పేజీల ఈ బిల్లుపై సెనేట్‌లో సుదీర్ఘ చర్చ జరిగింది. అనంతరం ఓటింగ్ నిర్వహించగా.. బిల్లుకు అనుకూలంగా 50 ఓట్లు, వ్యతిరేకంగా 50 ఓట్లు వచ్చాయి.
చివరికి ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ (JD Vance) టై-బ్రేకర్‌గా మారి బిల్లుకు అనుకూలంగా ఓటు వేయడంతో సెనేట్‌లో ఈ బిల్లు గట్టెక్కింది. 51-50 ఓట్లతో ఆమోదం లభించింది. దీంతో ఈ బిల్లు సెనేట్‌లో ఆమోదం పొందినట్లు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రకటించారు. ఈ బిల్లును అధికారపార్టీకి చెందిన ముగ్గురు రిపబ్లికన్ సెనేటర్లు వ్యతిరేకించారు. సెనేట్‌లో ఆమోదం పొందిన ఈ బిల్లు ప్రతినిధుల సభ ముందుకు వెళ్తుంది. అక్కడ ఆమోదం పొందిన అనంతరం అధ్యక్షుడి వద్దకు చేరుతుంది.
4.5ట్రిలియన్ డాలర్ల పన్ను తగ్గింపులు, మెడికెయిడ్, ఫుడ్ స్టాంప్‌లలో 1.2 ట్రిలియన్ డాలర్ల కోతలు, సరిహద్దు భద్రతకు నిధులు సమకూర్చడం, అక్రమ వలసదారులను వెనక్కి పంపే కార్యక్రమానికి నిధులు కేటాయించడం వంటి లక్ష్యాలతో ట్రంప్ సర్కార్ ఈ బిల్లును రూపొందించింది. ఈ బిల్లుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. డెమోక్రాట్లతోపాటూ, కొందరు రిపబ్లికన్లు సైతం ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నారు. ఈ బిల్లు కారణంగా టెస్లా బాస్ ఎలాన్ మస్క్, అధ్యక్షుడు ట్రంప్ మధ్య విభేదాలు భగ్గుమన్న విషయం తెలిసిందే.
Also Read..
Elon Musk | ఆ బిల్లును ఆమోదిస్తే.. కొత్త పార్టీ పెడతా!.. బిగ్ బ్యూటిపుల్ బిల్లుపై మస్క్ ప్రకటన
Elon Musk | ట్రంప్ బహిష్కరణ హెచ్చరికలతో వెనక్కి తగ్గిన మస్క్.. ఏమీ చేయదల్చుకోలేదు అంటూ పోస్ట్
India-US | త్వరలో భారత్‌తో వాణిజ్య ఒప్పందం.. చాలా తక్కువ సుంకాలతోనే డీల్ ఉంటుందన్న ట్రంప్