Joe Biden | రేపు ఇజ్రాయెల్‌లో పర్యటించనున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్
హమాస్ దాడులతో దెబ్బతిన్న ఇజ్రాయెల్‌లో (Israel) అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) పర్యటించనున్నారు. ఇజ్రాయెల్‌కు తెలిపేందుకు బైడెన్ బుధవారం ఆ దేశానికి వెళ్లనున్నారని విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ (Antony Blinken) తెలిపారు.
వాషింగ్టన్: హమాస్ దాడులతో దెబ్బతిన్న ఇజ్రాయెల్‌లో (Israel) అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) పర్యటించనున్నారు. ఇజ్రాయెల్‌కు తెలిపేందుకు బైడెన్ బుధవారం ఆ దేశానికి వెళ్లనున్నారని విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ (Antony Blinken) తెలిపారు. గాజాకు మానవతా సాయంపై ప్రధాని నెతన్యాహుతో చర్చలు జరుపుతారని వెల్లడించారు. గాజాకు (Gaza) సహాయం చేసే విషయంలో ఓ ప్రణాళికను రూపొందించడానికి ఇరు దేశాలు అంగీకరించినట్లు చెప్పారు. గాజాలోని పౌరులకు మానవతా సహాయం అందించే విధంగా తన కార్యకలాపాలను నిర్వహించాలని ఆశిస్తున్నట్లు తెలిపారు.
On Wednesday, @POTUS will visit Israel. He’s coming here at a critical moment for Israel, for the region, and for the world.
— Secretary Antony Blinken (@SecBlinken) October 17, 2023
తాను బుధవారం ఇజ్రాయెల్ వెళ్తున్నట్లు అధ్యక్షుడ బైడెన్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. హమాస్ ఉగ్రవాదుల ఎదుర్కొనేందుకు ఇజ్రాయెల్‌కు సంఘీభావంగా నిలుస్తామని చెప్పారు. మానవతా సాయం అందించే విషయమై అధికారులతో చర్చిస్తానని తెలిపారు. పాలస్తీనియన్ల స్వయం నిర్ణయాధికారం కోసం హమాస్ నిలబడదని స్పష్టం చేశారు.
On Wednesday, I’ll travel to Israel to stand in solidarity in the face of Hamas’s brutal terrorist attack.
I’ll then travel to Jordan to address dire humanitarian needs, meet with leaders, and make clear that Hamas does not stand for Palestinians’ right to self-determination.
— President Biden (@POTUS) October 17, 2023
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

