న్యూయార్క్: ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్‌పై ప్రశంసలు కురిపించారు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump). భారతీయ సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ 8 నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న విషయం తెలిసిందే. 8 రోజుల టూర్ కోసం వెళ్లిన వ్యోమగాములు.. గత 8 నెలలుగా స్పేస్ స్టేషన్లోనే ఉంటున్నారు. అయితే వాళ్లను తీసుకువచ్చేందుకు రెస్క్యూ టీమ్ వెళ్లనున్నట్లు ట్రంప్ తెలిపారు. విలియమ్స్‌తో పాటు బుచ్ విల్మోర్ కూడా ఆ స్పేస్ స్టేషన్లో ఉన్నారు. ఓవల్ ఆఫీసులో మీడియాతో మాట్లాడిన ట్రంప్ ..ఆ ఇద్దరు ఆస్ట్రోనాట్లను తీసుకురానున్నట్లు వెల్లడించారు. ఆ ఇద్దర్నీ అంతరిక్షంలోనే బైడెన్ వదిలేశారని ఆయన ఆరోపించారు.
స్పేస్ ఎక్స్ సంస్థ సీఈవో ఎలన్ మస్క్‌ను ఓ సాయం కోరానని, స్పేస్ స్టేషన్లో చిక్కుకున్న ఆస్ట్రోనాట్స్‌ను వెనక్కి తీసుకురావాలని మస్క్‌ను అడిగినట్లు ట్రంప్ తెలిపారు. అయితే మస్క్ ఆ ప్రయత్నంలో ఉన్నట్లు చెప్పారు. మరో రెండు వారాల్లో ఆ ఆస్ట్రోనాట్స్ భూమికి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలిపారు. ఆస్ట్రోనాట్స్‌ను తీసుకువచ్చేందుకు స్పేస్‌షిప్‌ను రెఢీ చేస్తున్నట్లు ట్రంప్ చెప్పారు. ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్ గురించి ట్రంప్ ప్రస్తావించారు. ఆమె కురులు చాలా దట్టంగా ఉన్నాయని, చాలా బలంగా ఉన్నట్లు కూడా ట్రంప్ తన మాటల్లో వ్యక్తం చేశారు. తాను చెప్పేది జోక్ కాదు అని, ఆమె శిరోజాలతో ఆటలాడడం లేదని ఓ పంచ్ వేశారు.
అమెరికా చరిత్రలోనే బైడెన్ అసమర్థ అధ్యక్షుడని, ఆయన వల్లే ఆస్ట్రోనాట తిరుగు ప్రయాణం ఆలస్యమైందని ఆరోపించారు. ఆరు నెలల క్రితం డ్రాగన్ స్పేస్‌షిప్ ద్వారా ఆస్ట్రోనాట్లను తీసుకువచ్చే ప్రయత్నం చేశామని, కానీ బైడెన్ సర్కారు తమకు అనుమతి ఇవ్వలేదని ఎలన్ మస్క్ తెలిపారు. 8 నెలలుగా స్పేస్‌లో ఉంటున్న సునీతా విలియమ్స్ ఇప్పటి వరకు 62 గంటల 6 నిమిషాల పాటు స్పేస్‌వాక్ చేసింది.
🚨 Trump Slams Biden for ‘Abandoning’ Astronauts in Space—Says He’s Sending Help 🚀🌎
President Trump sent a message to NASA astronauts Sunita Williams and Barry “Butch” Wilmore, claiming Biden left them stranded in space.
🔹 “We love you and we’re coming up to get you. You… pic.twitter.com/YyAacCa82o
— Kristy Tallman (@KristyTallman) March 6, 2025