వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) తన ట్రుత్ సోషల్ అకౌంట్లో రకరకాల పోస్టులతో కేక పుట్టిస్తున్నారు. ఆయన పోస్టులను గమనిస్తుంటే, మళ్లీ పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయన్న ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఏఐ ఆధారిత పిక్స్‌ను ట్రంప్ తన సోషల్ మీడియా అకౌంట్లో గత కొన్ని గంటల్లో పోస్టు చేశారు. ఇరాన్‌పై వార్‌ను మళ్లీ మొదలుపెట్టే ఉద్దేశం ఉన్న రీతిలో ఆ పిక్స్ ఉన్నాయి. కృత్రిమ మేధతో రూపొందించిన కొన్ని ఫోటోలకు క్యాప్షన్స్ ఉన్నాయి. మరికొన్ని పిక్స్‌కు క్యాప్షన్ లేదు. ఇరానీ బోట్లపై మిస్సైల్ దాడులు చేస్తున్నట్లు ఏఐ ఆధారిత ఇమేజ్‌లను ట్రంప్ పోస్టు చేశారు. అంతరిక్షంలో యుద్ధం జరుగుతున్నట్లు.. ఇక ఇరాన్ భూభాగంపై అమెరికా జెండా ఉన్నట్లుగా ఓ ఫోటోను ఆయన రిలీజ్ చేశారు.
కొన్ని గంటల వ్యవధిలోనే ట్రంప్ సుమారు 20 ఫోటోలను పోస్టు చేశారు. అయితే ఆ ఫోటోలన్నీ ఇరాన్‌ను టార్గెట్ చేసినట్లుగా ఉన్నాయి. దీంతో మళ్లీ ఎక్కడ ఇరాన్‌పై వార్ మొదలవుతుందో అన్న ఆందోళన నెలకొన్నది. ఇరానీ యుద్ధ విమానాలను టార్గెట్ చేసే అమెరికా యుద్ధ నౌక వీడియోను కూడా ఆయన రిలీజ్ చేశారు. ఓ టేబుల్ ముందు కూర్చున్న ట్రంప్.. కంప్యూటర్ టైప్ చేస్తున్నట్లుగా ఉన్నారు. బా బా బా.. అంటూ ఫైర్ బాంబ్ అని ఆ క్లిప్‌లో అన్నారు. మరో ఇమేజ్‌లో అమెరికా డ్రోన్.. ఇరానీ ఫాస్ట్ బోట్లను పేల్చినట్లుగా ఉంది. బై బై ఫాస్ట్ బోట్స్ అని రాశారు .
స్పేస్ ఫోర్స్ అన్న టైటిల్‌తో కొన్ని ఫోటోలను పోస్టు చేశారు. ఓ ఫోటోలో ఆయన చుట్టూ శాటిలైట్లు మోహరించి ఉన్నాయి. అంతరిక్ష కక్ష్యలో నుంచి మిస్సైల్స్ దాడి చేస్తాయి. మరో ఇమేజ్‌లో ఆయన కిల్ బటన్ నొక్కుతున్నట్లుగా ఉంది. ట్రంప్ స్క్రీన్ వెనుక రకరకాల క్షిపణులు ఉన్నాయి. న్యూక్లియర్ బ్లాస్ట్ జరిగినట్లు ఓ పిక్‌లో ఉన్నది. అయితే శాంతి ఒప్పందం కుదుర్చుకునే నేపథ్యంలో ఇరాన్ త్వరగా చర్యలు చేపట్టాలని ట్రంప్ తాజాగా వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఉన్నది. మరో వైపు 14 పాయింట్ల శాంతి ప్రణాళికను అమెరికాకు ఇరాన్ చేరవేసినట్లు తెలుస్తోంది. పాకిస్థానీ మధ్యవర్తుల ద్వారా ఆ 14 పాయింట్ ప్లాన్ అమెరికాకు ఇరాన్ అందజేసినట్లు తెలుస్తోంది. ఇక ట్రంప్ తన జాతీయ భద్రతా అడ్వైజర్లతో సిచ్యుయేషన్ రూమ్ భేటీ నిర్వహించనున్నారు.