Donald Trump: క్రిప్టో వ్యాపారంతో 104 కోట్ల డాలర్లు ఆర్జించిన డోనాల్డ్ ట్రంప్
Donald Trump: క్రిప్టోకరెన్సీ పెట్టుబడుల ద్వారా 2025లో ట్రంప్ సుమారు 104 కోట్ల డాలర్లు ఆర్జించినట్లు తెలిసింది. ట్రంప్ ఆర్థిక లావాదేవీలకు చెందిన రిపోర్టును రిలీజ్ చేశారు. అయితే ఆయన సంపద అమాంతం పెరిగినట్లు ఆ నివేదికలో వెల్లడించారు. రియల్ ఎస్టేట్, గోల్ఫ్ వ్యాపారం కన్నా.. క్రిప్టోతోనే ట్రంప్ ఫ్యామిలీ ఎక్కువ సంపాదించినట్లు తెలిసింది.
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) 2025లో క్రిప్టోకరెన్సీ పెట్టుబడుల ద్వారా సుమారు 104 కోట్ల డాలర్లు ఆర్జించినట్లు తెలిసింది. ట్రంప్ ఆర్థిక లావాదేవీలకు చెందిన రిపోర్టును రిలీజ్ చేశారు. అయితే ఆయన సంపద అమాంతం పెరిగినట్లు ఆ నివేదికలో తెలిపారు. ట్రంప్తో పాటు ఆయన కుమారులకు చెందిన క్రిప్టో వ్యాపారంలో భారీగా ఆదాయం వచ్చినట్లు తెలిసింది. క్రిప్టో పెట్టుబడుల ఆదాయం గురించి అమెరికా ప్రభుత్వాన్ని ట్రంప్ వెల్లడించారు.
సాధారణంగా రియల్ ఎస్టేట్, గోల్ఫ్ వ్యాపారంలో పెట్టుబడి పెట్టే ట్రంప్ ఫ్యామిలీకి.. గత ఏడాది క్రిప్టో వ్యాపారం ద్వారా దాదాపు 104 కోట్ల డాలర్లకుపైగా ఆదాయం వచ్చినట్లు తెలిసింది. వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ అనే క్రిప్టో కంపెనీ ద్వారా ట్రంప్ సుమారు 800 మిలియన్ల డాలర్లు ఆర్జించారు. ఆ కంపెనీలో ఆయన కుమారులు కూడా భాగస్వామ్యులుగా ఉన్నారు. క్రిప్టో టోకెన్ సేల్స్ ద్వారా 520 మిలియన్ల డాలర్లు, ఇక వరల్డ్ లిబర్టీ బిజినెస్ లో క్రిప్టో అమ్మకాల ద్వారా మరో 250 మిలియన్ల డాలర్లు ఆర్జించినట్లు తెలిసింది. ట్రంప్ మీమి కాయిన్ల అమ్మకం ద్వారా అదనంగా 635 మిలియన్ల డాలర్లు ఆర్జించారు.
రెండో సారి దేశాధ్యక్షుడిగా అధికారం చేపట్టిన తర్వాత ట్రంప్ క్రిప్టో ఆస్తులు ఒక్కసారిగా జంప్ చేశాయి. 2024లో ట్రంప్ టోకెన్ సేల్స్ ద్వారా కేవలం 57.35 మిలియన్ల డాలర్లు మాత్రమే ఆర్జించారు.అయితే తాజా గణాంకాల ప్రకారం ట్రంప్ క్రిప్టో ఆస్తులు సుమారు తొమ్మిది రెట్లు పెరిగినట్లు అంచనా వేస్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

