వాషింగ్టన్, మే 13: యుద్ధాన్ని ముగించడానికి అమెరికా-ఇరాన్ తీసుకుంటున్న చర్యల్లో ఏమాత్రం పురోగతి కనిపించడం లేదు. యుద్ధాన్ని ముగించడానికి వాషింగ్టన్ చేసిన ప్రతిపాదనలను టెహ్రాన్ అంగీకరించకపోవడంతో ఒప్పం దం మరింత ఆలస్యమవుతున్నది. ఈక్రమంలో అమెరికా విదేశాంగ శాఖ ఒక కీలక ప్రకటన చేసింది. ఐఆర్జీసీ ఆర్థిక మూలాలు చెబితే.. వారికి రూ.145 కోట్ల వరకు బహుమతిగా ఇస్తామని బహిరంగంగా ఆఫర్ చేసింది.
ఐఆర్జీసీ దాని సంబంధిత శాఖలకు కీలక ఆర్థిక వనరులను అందించే బినామీ కంపెనీలు, వ్యక్తులు, ఆర్థిక సంస్థల సమాచారాన్ని తమకు తెలియజేయాల్సిందిగా కోరింది. గల్ఫ్ దేశాలపై దాడులు చేయకుండా.. అణు కార్యక్రమాలు చేపట్టకుండా ఇరాన్ను ఆర్థికంగా దెబ్బతీయటం కోసమే ఈ చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించింది.