US-Iran talks : పాకిస్థాన్ (Pakistan) రాజధాని ఇస్లామాబాద్ (Islamabad) వేదికగా అమెరికా-ఇరాన్ (US-Iran) మధ్య మరికొన్ని గంటల్లో శాంతి చర్చలు (Peace talks) జరుగనున్నాయి. ఈ చర్చల కోసం అమెరికా ఉపాధ్యక్షుడు (US Vice President) జేడీ వాన్స్ (JD Vance) బృందం తాజాగా ఇస్లామాబాద్‌లో ల్యాండ్ అయ్యింది. వాన్స్ నేతృత్వంలోని ఈ బృందంలో పశ్చిమాసియా (West Asia) ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ (Steve Witkoff), అధ్యక్షుడు ట్రంప్ అల్లుడు జేర్డ్ కుష్నర్ (Jared Kushner) ఉన్నారు.
యూఎస్ ఎయిర్‌ఫోర్స్ సీ-32ఏ విమానంలో వీరు ప్రయణించారు. తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో విమానం ఇరాన్ గగనతలాన్ని టచ్ చేయకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో ఇస్లామాబాద్‌కు చేరుకుంది. ఇక ఇరుదేశాలు నిర్మాణాత్మకంగా చర్చలు జరుపుతాయని, ఇకనైనా యుద్ధానికి శాశ్వత శాంతి లభిస్తుందని ఈ సందర్భంగా పాకిస్థాన్ ఆశాభావం వ్యక్తంచేసింది. అమెరికాతో చర్చలకు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్ఛీ, పార్లమెంటు స్పీకర్ మొహమ్మద్ బాఘర్ ఘాలిబఫ్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఇప్పటికే ఇస్లామాబాద్‌కు చేరుకుంది. మరికొద్దిసేపట్లో ఈ చర్చలు ప్రారంభం కానున్నట్లు పాకిస్థాన్ వర్గాలు వెల్లడించాయి.