US vs Iran | ఇరాన్‌తో 39 రోజులు సాగిన యుద్ధం.. 39 యుద్ధ విమానాలు కోల్పోయిన అమెరికా
US vs Iran | ఇరాన్ (Iran) పై అమెరికా (USA) చేపట్టిన ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ లో అగ్రరాజ్య సైన్యానికి భారీనష్టం జరిగినట్లు తెలుస్తోంది. దాదాపు 39 రోజులపాటు యుద్ధం కొనసాగగా.. అగ్రరాజ్యానికి చెందిన 39 విమానాలను ఇరాన్ ధ్వంసం చేసింది. ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్ (Israel) తో కలిసి ఇరాన్ (Iran) పై అగ్రరాజ్యం విరుచుకుపడటంతో పశ్చిమాసియా (West Asia) లో యుద్ధజ్వాలలు (US-Iran Conflicts) చెలరేగాయి.
US vs Iran : ఇరాన్ (Iran) పై అమెరికా (USA) చేపట్టిన ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ లో అగ్రరాజ్య సైన్యానికి భారీనష్టం జరిగినట్లు తెలుస్తోంది. దాదాపు 39 రోజులపాటు యుద్ధం కొనసాగగా.. అగ్రరాజ్యానికి చెందిన 39 విమానాలను ఇరాన్ ధ్వంసం చేసింది. ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్ (Israel) తో కలిసి ఇరాన్ (Iran) పై అగ్రరాజ్యం విరుచుకుపడటంతో పశ్చిమాసియా (West Asia) లో యుద్ధజ్వాలలు (US-Iran Conflicts) చెలరేగాయి. ఇరాన్ ప్రతీకార దాడులతో ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చాయి.
ఐదు వారాలకుపైగా కొనసాగిన ఈ ఘర్షణల్లో యూఎస్‌కు చెందిన 39 విమానాలు ధ్వంసమైనట్లు తెలుస్తోంది. మరో 10 విమానాలు వివిధ స్థాయిల్లో దెబ్బతిన్నట్లు సమాచారం. కూలిన అమెరికా విమానాల్లో ఒక ఏ-10, నాలుగు ఎఫ్-15 స్ట్రైక్ ఈగిల్ యుద్ధవిమానాలు ఉన్నాయి. ఇరాన్ గగనతలంలో అమెరికా ఎఫ్-35 స్టెల్త్ యుద్ధవిమానం ఒకటి దెబ్బతిన్నది. అగ్రరాజ్యం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ఈ ఐదోతరం యుద్ధ విమానం పోరాటంలో శత్రుదాడికి గురికావడం ఇదే తొలిసారి.
సౌదీ అరేబియాలోని ఓ వైమానిక స్థావరంపై ఇరాన్ జరిపిన క్షిపణి దాడిలో ఐదు కేసీ-135 రీఫ్యూయలింగ్ విమానాలు దెబ్బతిన్నాయి. అయితే వాటిల్లో కొన్నింటికి మరమ్మతులు చేశారు. సౌదీ వైమానిక స్థావరంపై జరిగిన దాడిలో అగ్రరాజ్యానికి చెందిన అత్యాధునిక ‘బోయింగ్ ఈ-3 సెంట్రీ నిఘా విమానం కూడా తీవ్రంగా ధ్వంసమైంది. ఇక యూఎస్‌కు చెందిన నాలుగు F-15E ఫైటర్ జెట్లు కూడా కూలిపోయాయి. వీటిల్లో మూడు కువైట్‌లో జరిగిన ‘ఫ్రెండ్లీ ఫైర్’ లో భాగంగా కూలినట్లు యూఎస్ సెంటకామ్ పేర్కొన్నది.
కువైట్‌లోని అమెరికా స్థావరంపై జరిగిన డ్రోన్ దాడిలో ఒక CH-47 చినూక్ హెలికాప్టర్ ధ్వంసమైందని ఇరాన్ మీడియా తెలిపింది. ఇవిగాక ఈ ఘర్షణల్లో అమెరికాకు చెందిన డ్రోన్ విభాగానికి భారీగా నష్టం జరిగింది. దాదాపు 24 MQ-9A రీపర్ డ్రోన్లు ధ్వంసమయ్యాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
INDIA Bloc | ఇండియా బ్లాక్ కూటమిలో విబేధాలు.. సుప్రీంకోర్టులో పిటిషన్‌కు దూరంగా ప్రధాన పార్టీలు
ECB | ఇంగ్లండ్ స్క్వాడ్‌లో కొత్త కుర్రాళ్లు.. బెథెల్, ఆర్చర్‌కు పిలుపు..!
Auto Immune Diseases | మహిళల్లో అధికమవుతున్న ఆటో ఇమ్యూన్ వ్యాధుల సమస్య.. జాగ్రత్తలు తప్పనిసరి..
Sai Pallavi | ప్రభాస్ ‘కల్కి 2’ మూవీకి సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్.. షూటింగ్ అప్డేట్!
Bernie Sanders | డొనాల్డ్ ట్రంప్‌పై పెట్టుబడితో మస్క్‌కు లక్షల కోట్ల లాభం.. బెర్నీ శాండర్స్ ఎద్దేవా..!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

