US-Iran War : ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దళాలు దాడులు కొనసాగిస్తూనే ఉన్నాయి. తాజాగా ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై అమెరికా భారీ వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో ఇరాన్‌కు చెందిన మిలిటరీ అగ్రనేతలు చాలా మంది మరణించారని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. ఈ మేరకు ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియా ఖాతాలో ప్రకటన చేశారు.
‘‘టెహ్రాన్‌పై అమెరికా జరిపిన వైమానిక దాడుల్లో ఇరాన్ సైన్యాన్ని బలహీనంగా, తెలివితక్కువగా నడిపించిన చాలా మంది ఆ దేశ సైనిక లీడర్లు చాలా మంది హతమయ్యారు’’ అని ట్రంప్ ప్రకటించారు. దీనికి సంబంధించి కొన్ని వీడియోల్ని కూడా ట్రంప్ విడుదల చేశారు. అయితే, మరణించిన మిలిటరీ లీడర్ల వివరాల్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. అయితే, ట్రంప్ ప్రకటనపై ఇరాన్ నుంచి ఎలాంటి స్పందనా లేదు. మరోవైపు ట్రంప్.. హార్ముజ్ జలసంధి విషయంలో ఇరాన్‌కు హెచ్చరిక జారీ చేశారు. 48 గంటల్లోగా జలసంధిని తెరవాలని అల్టిమేటమ్ ఇచ్చారు. లేకుంటే ఇరాన్‌పై విరుచుకుపడుతామని ట్రంప్ అన్నారు. ఈ వార్నింగ్ అనంతరం ఇరాన్‌పై అమెరికా దాడులకు దిగింది. మరోవైపు తమ పైలట్‌ను కాపాడుకునేందుకు అమెరికా చేపట్టిన ఆపరేషన్ విజయవంతమైంది. ఇరాన్లో చిక్కుకున్న పైలట్‌ను అమెరికా రక్షించుకుంది. ఇంకోవైపు ఇరాన్ కూడా దాడులు కొనసాగిస్తోంది. తాజాగా కువైట్‌పై దాడి చేసింది. కువైట్‌లోని షువైఖ్ ఆయిల్ సెక్టార్ కాంప్లక్స్పై ఇరాన్ డ్రోన్‌లో విరుచుకుపడింది.
Donald J. Trump Truth Social 04:04.26 04:37 PM EST
Many of Iran’s Military Leaders, who have led them poorly and unwisely, are terminated, along with much else, with this massive strike in Tehran! President DONALD J. TRUMP pic.twitter.com/kn2fwYTjjG
— Commentary Donald J. Trump Posts From Truth Social (@TrumpDailyPosts) April 4, 2026
దీంతో ఇక్కడ భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ఈ కాంప్లెక్స్‌లోనే కువైట్ చమురు మంత్రిత్వశాఖ కార్యాలయం కూడా ఉంది. కువైట్‌లోని మరో ప్రభుత్వ భవనంపై కూడా ఇరాన్ దాడి చేసింది. అయితే, ఇరాన్ ప్రయోగించిన కొన్ని క్షిపణుల్ని తమ వైమానిక రక్షణ వ్యవస్థలు విజయవంతంగా అడ్డుకున్నాయని కువైట్ తెలిపింది. మరోవైపు ఇరాన్, అమెరికా మధ్య శాంతి చర్చలు నిలిచిపోయాయి. అమెరికా పెట్టిన షరతులు ఆమోదయోగ్యం కాదని ఇరాన్ తెలిపింది. దీంతో తాము చర్చల్లో పాల్గొనడం లేదని మధ్యవర్తులకు సమాచారం అందించింది.