న్యూయార్క్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు మరో షాక్ తగిలింది. ఇరాన్‌పై సైనిక చర్య నిలిపివేసే తీర్మానానికి అమెరికా ప్రతినిధుల ఆమోదం తెలిపింది. ఇక నుంచి ఇరాన్ మీద మిలిటరీ యాక్షన్ చేపట్టాలంటే కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు ఉండాల్సిందేనని ఒక తీర్మానాన్ని పాస్ చేసింది.
నలుగురు రిపబ్లికన్లు డెమోక్రాట్లతో చేతులు కలపడంతో 215-208 ఓట్ల తేడాతో ఈ తీర్మానం ఆమోదం పొందింది. ఫిబ్రవరి నెల నుంచి ట్రంప్ ఇష్టానుసారంగా మిలిటరీ వ్యవస్థను వాడుతున్నారని.. ఆయన అధికారాలను నియంత్రించేందుకు ఈ తీర్మానం ప్రవేశపెట్టినట్టు ప్రతినిధుల సభ చెప్పింది. ఈ తీర్మానానికి సెనేట్ ఆమోదం అవసరం ఉంది. ఒకవేళ అక్కడ కూడా పాస్ అయితే అప్పుడు అధ్యక్షుడి వీటో అధికారాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది.