Visa Premium Processing Fee | వీసాల విషయంలో అమెరికా మరో షాకింగ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే హెచ్1-బీ వీసాల వార్షిక ఫీజుల్ని లక్ష డాలర్లకు పెంచేసిన ట్రంప్ ప్రభుత్వం.. ఇప్పుడు ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజులను కూడా పెంచింది (Visa Premium Processing Fee). ప్రస్తుతం 2,805 డాలర్లుగా ఉన్న ప్రాసెసింగ్ ఫీజును 2,965 డాలర్లకు పెంచుతున్నట్లు ప్రకటించింది. తాజా పెంపు మార్చి 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నట్లు తెలిపింది.
జూన్ 2023 నుంచి జూన్ 2025 వరకు నమోదైన ద్రవ్యోల్బణంను పరిగణలోకి తీసుకుని ఈ పెంపు చేసినట్లు యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) వెల్లడించింది. దీంతోపాటూ మిగతా వీసా కేటగిరీల ప్రాసెసింగ్ ఫీజుల్లోనూ మార్పులు చేసింది. హెచ్-1బీ, ఎల్-1, ఒ-1, పీ-1, టీఎన్ వీసాల (ఫారమ్ I-129) ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజు 2,805 డాలర్ల నుంచి 2,965 డాలర్లకు పెరిగింది. ఎఫ్-1, జే-1 వంటి వీసాల (ఫారం I-539) విషయంలో ఫీజును 1,965 డాలర్ల నుంచి 2,075 డాలర్లకు పెంచింది. ఫారమ్ I-129 (H-2B, R-1 వీసాలు) ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజు 1,685 డాలర్ల నుంచి 1,780 డాలర్లకు పెరిగింది.
Also Read..
Aircraft Crashes | ఒడిశాలో కుప్పకూలిన చార్టర్డ్ ఫ్లైట్.. పలువురికి గాయాలు
Dalit Woman Murdered, Daughter Kidnapped | దళిత మహిళను హత్య చేసి.. ఆమె కుమార్తెను కిడ్నాప్