మంగళవారం 26 మే 2020
International - Apr 20, 2020 , 16:21:08

స్టే ఎట్ హోమ్ నిర‌స‌న‌లు.. ట్రంప్‌పై భ‌గ్గుమంటున్న గ‌వ‌ర్న‌ర్లు

స్టే ఎట్ హోమ్ నిర‌స‌న‌లు.. ట్రంప్‌పై భ‌గ్గుమంటున్న గ‌వ‌ర్న‌ర్లు

హైద‌రాబాద్‌: అమెరికాలో విచిత్ర ప‌రిస్థితి నెల‌కొన్న‌ది. దేశాధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్‌.. వివిధ రాష్ట్రాల గ‌వ‌ర్న‌ర్ల మ‌ధ్య మాట‌ల యుద్ధం న‌డుస్తున్న‌ది.  స్టేట్ ఎట్ హోమ్ ఆదేశాల‌పై శ్వేత‌సౌధం నుంచి భిన్న స్వ‌రాలు వినిపిస్తున్న నేప‌థ్యంలో.. అమెరికా రాష్ట్రాల్లో ప‌రిస్థితి ఆగ‌మ్య‌గోచ‌రంగా ఉన్న‌ది. స్టేట్ ఎట్ హోమ్ లాంటి క‌ఠిన ఆంక్ష‌ల‌ను ఎత్తివేయాల‌ని కొంద‌రు ఆందోళ‌న‌కారులు దేశ‌వ్యాప్తంగా భారీ నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు చేప‌ట్టారు. అయితే వారిని స‌మ‌ర్థిస్తూ ట్రంప్ ట్వీట్ చేశారు.  దీన్ని కొన్ని రాష్ట్రాల గ‌వ‌ర్న‌ర్లు వ్య‌తిరేకించారు.  దేశాధ్య‌క్షుడే ఆందోళ‌న‌కారుల్ని రెచ్చ‌గొట్ట‌డం ఏమిట‌ని వాషింగ్ట‌న్ డెమోక్ర‌టిక్ గ‌వ‌ర్న‌ర్ జే ఇన్‌లీ ఆరోపించారు. ఇలా రెచ్చ‌గొట్ట‌డం ప్ర‌మాద‌క‌ర‌మ‌ని, ఎందుకంటే ప్రాణాల‌ను కాపాడే ఆంక్ష‌ల‌ను వారు విస్మ‌రిస్తున్నార‌ని ఆయ‌న అన్నారు.

జీవ‌నోపాధి కోల్పోయిన వేలాది మంది వీధుల్లో ఆందోళ‌న‌లు చేప‌డుతున్నారు. ట్రంప్ మ‌ద్ద‌తుదారులు సోష‌ల్ డిస్టాన్సింగ్ నియ‌మావ‌ళిని ఉల్లంఘిస్తున్న‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. స్టేట్ ఎట్ హోమ్ ఆదేశాల‌ను గ‌వ‌ర్న‌ర్లు ఎత్తివేయాల‌ని నిర‌స‌న‌కారులు డిమాండ్ చేశారు. మిచిగ‌న్‌లో భారీ ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టారు. అయితే ఆంక్ష‌ల నుంచి స్వేచ్ఛ క‌ల్పించాలంటూ ఇటీవ‌ల ట్రంప్ కొంద‌రు డెమోక్ర‌టిక్ గ‌వ‌ర్న‌ర్ల‌ను కోరారు. క‌రోనా నుంచి త‌ప్పించుకునేందుకు లాక్‌డౌన్ లాంటి ఆంక్ష‌లు అమ‌లు చేస్తుండ‌గా, మ‌రోవైపు ఆర్థిక వ్య‌వ‌స్థ దెబ్బ‌తింటుంద‌న్న భ‌యంతో జ‌నం ఆందోళ‌న‌కు దిగుతున్నారు. దేశంలోని అనేక ప్రాంతాలు సాధార‌ణ స్థితి వ‌చ్చేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు ట్రంప్ చెప్పారు. కొంద‌రు గ‌వ‌ర్న‌ర్లు మాత్రం ఫెడ‌ర‌ల్ ప్ర‌భుత్వ వైఖ‌రి స‌రిగా లేద‌ని ఆరోపిస్తున్నారు.

ఎందుకు క‌ఠిన ఆంక్ష‌లు పెట్టిన ట్రంప్ ప్ర‌భుత్వ‌మే వాటిని ఉల్లంఘిస్తుద‌ని వేసిన ప్ర‌శ్న‌కు ఉపాధ్య‌క్షుడు మైక్ పెన్స్ స‌మాధానం ఇవ్వ‌లేక‌పోయారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు వైర‌స్ వ‌ల్ల ల‌క్షా 65 వేల మంది చ‌నిపోయారు. అమెరికాలో వైర‌స్ సోకిన వారి సంఖ్య 7 ల‌క్ష‌లు దాటింది. ఇక మ‌ర‌ణించిన వారి సంఖ్య 41 వేలుగా ఉన్న‌ది. అయితే మే ఒక‌ట‌వ తేదీ క‌న్నా ముందే దేశంలో ఆంక్ష‌ల‌ను స‌డ‌లించాల‌ని ట్రంప్ ప్ర‌భుత్వం భావిస్తున్న‌ది. కానీ వైర‌స్ నియంత్ర‌ణ‌కు విస్తృత స్థాయిలో ప‌రీక్ష‌లు చేప‌ట్టాల‌ని హెల్త్ నిపుణులు చెబుతున్నారు. ఆయా రాష్ట్రాల గ‌వ‌ర్న‌ర్లే జాప్యం చేస్తున్న‌ట్లు ట్రంప్ ఆరోపిస్తున్నారు. కానీ గ‌వ‌ర్న‌ర్లు మాత్రం ఫెడ‌ర‌ల్ ప్ర‌భుత్వ వైఫ‌ల్యం వ‌ల్ల విస్తృత స్థాయిలో ప‌రీక్ష‌లు జ‌ర‌గ‌డంలేదంటున్నారు.

ప్ర‌తి రోజు ఎక్కువ స్థాయిలో క‌రోనా ప‌రీక్ష‌లు చేపట్టిన త‌ర్వాత‌నే ఆంక్ష‌ల‌ను స‌డ‌లిస్తామ‌ని కాలిఫోర్నియా గ‌వ‌ర్న‌ర్ గెవిన్ న్యూస‌మ్ తెలిపారు. ఆయా రాష్ట్రాల గ‌వ‌ర్న‌ర్లు త‌మ ప‌నిని వేగ‌వంతం చేయాల‌ని ట్రంప్ త‌న తాజా ట్వీట్‌లో అభిప్రాయ‌ప‌డ్డారు.కొన్ని రాష్ట్రాలు మాత్రం రిటేల్ వ్యాపారానికి అనుమ‌తి ఇచ్చాయి.logo