వాషింగ్టన్ : ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం నేపథ్యంలో పశ్చిమాసియాకు మరిన్ని ఫైటర్ జెట్లు మోహరిస్తున్నట్టు అమెరికా ఉన్నతాధికారి ఒకరు మంగళవారం వెల్లడించారు. ఎఫ్-16, ఎఫ్-22, ఎఫ్-35 యుద్ధ విమానాలు ఈ జాబితాలో ఉన్నాయని చెప్పారు.
బాలిస్టిక్ మిస్సైళ్లను కూల్చివేయగల యుద్ధ నౌకలను కూడా మోహరించనున్నట్టు మరో అధికారి తెలిపారు. పశ్చిమాసియాలో ఇప్పటికే అమెరికాకు 40 వేల బలగాలు, ఎయిర్‌డిఫెన్స్ సిస్టమ్స్, ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్స్, వార్‌షిప్స్ ఉన్నాయి.