న్యూయార్క్ : హైపర్సానిక్ క్షిపణులను సమీకరిస్తున్న చైనాను అమెరికా ఎండగట్టింది. ఈ తరహా ఆయుధాలతో ఉద్రిక్తతలు పెరుగుతాయని డ్రాగన్తో పొంచి ఉన్న ముప్పులను నివారించేందుకు అమెరికా కట్టుబడిఉందని స్పష్టం చేసింది. డ్రాగన్ సమకూర్చుకుంటున్న సైనిక పాటవం, సాధనా సంపత్తితో ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెచ్చుమీరతాయని అమెరికా ఆందోళన చెందుతోందని రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ పేర్కొన్నారు.
జులైలో చైనా చేపట్టిన లేటెస్ట్ హైపర్సోనిక్ క్షిపణి పరీక్షలపై చర్చ సందర్భంగా ఆస్టిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. చైనా చేపడుతున్న సైనిక సామర్ధ్యం పెంపు చర్యలు అమెరికన్ రక్షణ వ్యూహాలకు విసిరే సవాళ్లను ప్రస్తావిస్తూ ఆస్టిన్ స్పందించారు.