వాషింగ్టన్: పాకిస్థానీ ఉగ్రవాద సంస్థ లష్కరే తాయిబా అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్)ను అమెరికా ప్రభుత్వం ఉగ్రవాద సంస్థగా గురువారం ప్రకటించింది. పహల్గాం ఉగ్ర దాడి చేసింది తామేనని టీఆర్ఎఫ్ ప్రకటించిన నేపథ్యంలో ట్రంప్ ఆదేశాల మేరకు అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు టీఆర్ఎఫ్ను ‘విదేశీ ఉగ్రవాద సంస్థ’గా గుర్తిస్తున్నట్టు విదేశాంగ మంత్రి మార్కొ రుబియో ఒక ప్రకటన చేశారు. టీఆర్ఎఫ్ను లష్కరే తాయిబాపై ఆధారపడిన దుష్ట సంస్థగా ఆయన పిలిచారు. పహల్గాం దాడి ఘటనలో న్యాయం జరగాలని ట్రంప్ కోరారని రుబియో గుర్తు చేశారు.