Pramila Jayapal | అది ప్రజాస్వామ్యానికే ప్రమాదకరం..ఇండియాలో ‘సర్’ పై యూఎస్ కాంగ్రెస్ మెంబర్ ప్రమిలా జయ్పాల్ తీవ్ర ఆందోళన
Pramila Jayapal | భారతదేశంలో(Indi) ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) పై అమెరికా కాంగ్రెస్ సభ్యురాలు, భారత సంతతికి చెందిన ప్రమిలా జయ్పాల్(Pramila Jayapal) తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
Pramila Jayapal | భారతదేశంలో(Indi) ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) పై అమెరికా కాంగ్రెస్ సభ్యురాలు, భారత సంతతికి చెందిన ప్రమిలా జయ్పాల్(Pramila Jayapal) తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సర్ ప్రక్రియ ద్వారా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా నుండి దాదాపు 13 కోట్ల మంది (130 మిలియన్లు) ఓటర్ల పేర్లను తొలగించడంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా వెలుగొందుతున్న ఇండియాలో గంప గుత్తగా ఇంత పెద్ద మొత్తంలో పేర్లను తొలగించడాన్ని ప్రమిలా జయ్పాల్ “ప్రజాస్వామ్య వ్యతిరేక ప్రయత్నం”గా అభివర్ణించారు. అంతేకాదు అమెరికాలో ఓటర్ల హక్కులను కాలరాయడానికి గతంలో యూఎస్ ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ యంత్రాంగం అనుసరించిన వ్యూహాల తరహాలోనే ప్రస్తుతం భారతదేశంలో కూడా జరుగుతోందని ఆమె సోషల్ మీడియా వేదికగా విమర్శించారు.
ప్రజాస్వామ్య వాదులు ఇలాంటి చర్యలను హర్షించబోరన్నారు. ‘సర్స ప్రక్రియకు వ్యతిరేకంగా ఓటర్ల తొలగింపును నిరసిస్తూ ఢిల్లీ, ముంబై సహా భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో జరుగుతున్న శాంతియుత నిరసన ప్రదర్శనలకు ఆమె తన పూర్తి మద్దతును ప్రకటించారు. ప్రజాస్వామ్యానికి ఓటు హక్కు పునాది అని, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం శాంతియుతంగా చేపట్టి ఎలాంటి చర్యలకైనా మద్దతు ప్రకటించాలని ఆమె పిలుపునిచ్చారు. కాగా, సర్పై దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు ఆందోళనలు చేపట్టాయి. సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న తరుణంలో ప్రమిలా జయ్పాల్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- America
- India
- Pramila Jayapal
- sir
RELATED ARTICLES
తాజా వార్తలు
Pramila Jayapal | అది ప్రజాస్వామ్యానికే ప్రమాదకరం..ఇండియాలో ‘సర్’ పై యూఎస్ కాంగ్రెస్ మెంబర్ ప్రమిలా జయ్పాల్ తీవ్ర ఆందోళన
Cyber Crime | వీడియోకాల్ చేసి రూ. 2.20 కోట్లు కొట్టేసిన సైబర్ కేటుగాళ్లు
Ramayana | ‘రామాయణ’ విజువల్స్పై మళ్లీ విమర్శలు.. హాలీవుడ్ స్థాయి గ్రాఫిక్స్ ఎక్కడంటూ నెటిజన్ల ప్రశ్నలు!
Jailer 2 | ‘జైలర్ 2’ ట్విట్టర్ రివ్యూ.. రజనీకాంత్ వింటేజ్ మాస్ స్వాగ్, అనిరుధ్ బీజీఎంతో థియేటర్లలో రచ్చ!
Plane crash | అమెరికాలో ఘోర విమాన ప్రమాదం.. ఆరుగురు మృతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

