White House: ఇరాన్ వద్ద అణు ఆయుధం ఉండరాదు.. అంగీకరించిన చైనా, అమెరికా
White House: ఇరాన్ వద్ద అణ్వస్త్రం ఉండరాదని అమెరికా, చైనా దేశాలు సంయుక్తంగా అంగీకరించినట్లు శ్వేత సౌధం ఓ ప్రకటనలో వెల్లడించింది. ప్రస్తుతం డోనాల్డ్ ట్రంప్ చైనాలో పర్యటిస్తున్నారు. బీజింగ్‌లో ఆయన జిన్‌పింగ్‌తో కలిసి ఓ టెంపుల్‌ను విజిట్ చేశారు. ఆ ఇద్దరు నేతల మధ్య జరిగిన భేటీలో ఇరాన్ అంశం ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది.
బీజింగ్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ .. చైనాలో పర్యటిస్తున్నారు. బీజింగ్‌లో ఆయన ఆ దేశాధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో భేటీ అయ్యారు. ఆ ఇద్దరూ పలు అంశాలపై చర్చించుకున్నారు. చైనా అధ్యక్షుడు ఇచ్చిన విందులో ట్రంప్ పాల్గొన్నారు. ఆయనతో పాటు అమెరికా ప్రతినిధులు అందరూ ఆ బాంక్వెట్‌కు హాజరయ్యారు. తొలి రోజు మీటింగ్ తర్వాత ఇవాళ వైట్‌హౌజ్(White House) కీలక ప్రకటన జారీ చేసింది. ఇరాన్ అణు ఆయుధం కలిగి ఉండరాదని అమెరికా, చైనా సంయుక్తంగా అంగీకరించినట్లు శ్వేత సౌధం తన ప్రకటనలో వెల్లడించింది. ఇరు దేశాల నేతల మధ్య మీటింగ్ గొప్పగా జరిగినట్లు పేర్కొన్నది. అయితే హోర్ముజ్ జలసంధిలో సైనిక బలగాలను మోహరించడాన్ని చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ వ్యతిరేకించారు. హోర్ముజ్ జలసంధి మార్గంలో ప్రయాణించే ఇంధన నౌకలకు టోల్ వసూల్ చేయడాన్ని కూడా చైనా తప్పుపట్టింది. అయితే హోర్ముజ్ ద్వారా సరఫరా అయ్యే ఇంధనంపై ఆధారపడడం తగ్గించుకోనున్నట్లు చైనా తెలిపింది. ఇక అమెరికా నుంచి ఎక్కువ మోతాదులో ఇంధనాన్ని కొనుగోలు చేయనున్నట్లు డ్రాగన్ దేశం చైనా పేర్కొనడం గమనార్హం.
చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ను అమెరికాకు ఆహ్వానించారు ట్రంప్. జిన్‌పింగ్ సతీమణి పెంగ్ లియాన్‌కు కూడా ఆ ఇన్విటేషన్ అందజేశారు. సెప్టెంబర్ 24వ తేదీన వైట్‌హౌజ్‌కు రావాలని ట్రంప్ తన ఆహ్వానంలో కోరారు. బీజింగ్‌లో ఉన్న టెంపుల్ ఆఫ్ హెవెన్ను ట్రంప్ సందర్శించారు. ఇద్దరు దేశాధ్యక్షులు ఆ ఆలయం ముందు ఫోటోలు దిగారు. హాల్ ఆఫ్ ప్రేయర్ ఫర్ గుడ్ హార్వెస్ట్స్ ముందు ఫోటో దిగారు. ఆ ఆలయ సమూహం గురించి ట్రంప్‌కు జిన్‌పింగ్ వివరించారు. ప్రభుత్వ పండుగలను ఈ టెంపుల్లోనే నిర్వహించేవారని చెప్పారు. దేశ శ్రేయస్సు కోసం, సామాజిక సామరస్యం కోసం, మంచి పంటలు పండాలని చైనా పరిపాలకులు ఇక్కడ ప్రార్థనలు చేసేవారన్నారు.
రాజ్యానికి ప్రజలే ఫౌండేషన్ అని, అయితే ఆ బీజం బలంగా ఉంటేనే, రాజ్యం కూడా స్థిరంగా ఉంటుందని జిన్‌పింగ్ తెలిపారు. చైనీయుల నాగరికతకు చెందిన ఈ సిద్ధాంతాన్నే తమ కమ్యూనిస్టు పార్టీ అవలంబిస్తోందన్నారు. మనసుపూర్తిగా ప్రజా సేవకు తమ పార్టీ అంకితమైందని, దాని వల్ల తమకు చైనా ప్రజల మద్దతు లభిస్తోందన్నారు. సుమారు 600 ఏళ్లకు పురాతమైన టెంపుల్ ఆఫ్ హెవన్ పట్ల ట్రంప్ ఆసక్తి కనబరిచారు. చాలా ఇంప్రెసివ్‌గా ఉందన్నారు. అమెరికా, చైనా గొప్ప దేశాలు అని, రెండు దేశాల ప్రజలు గొప్పవారని ట్రంప్ పేర్కొన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

