వాషింగ్టన్: అమెరికాకు చెందిన రియల్ ఎస్టేట్ టెక్నాలజీ కంపెనీ ఓపెన్ డోర్ భారతదేశంలో తన కార్యకలాపాలను మూసివేయనున్నట్లు తెలిపింది. సంస్థ తమ అమెరికా కస్టమర్లకు మరింత చేరువగా కార్యాచరణను రూపొందించడం, ఏఐ ఆధారిత సేవల వినియోగాన్ని విస్తరించడం లాంటి చర్యల్లో భాగం గా ఈ నిర్ణయం తీసుకుంది. ఫలితంగా 250 మంది భారతీయు ఉద్యోగులు తమ ఉద్యోగాలను కో ల్పోనున్నారు.
వీరికి సంస్థ ఉద్యోగ ముగింపు పరిహారం, అవుట్ ప్లేస్మెంట్ మద్దతు లాంటి సహాయాలను అందించనుంది. సంస్థ సీఈవో కాజ్ నెజాటియన్ ఒక ప్రకటనలో ఈ వివరాలు తెలిపారు. విభిన్న వ్యవస్థల్లో మాన్యువల్ వర్క్ ఫ్లోలను నిర్వహించేందుకు కంపెనీ గతంలో భారత్లో పెద్ద బృందాన్ని ఏర్పాటు చేసిందని అయితే సాంకేతికతలో వచ్చిన మెరుగుదల కారణంగా ఆ విధులను విదేశాల్లో కొనసాగించాల్సిన అవసరం తగ్గిందని కాజ్ నెజాటియన్ తెలిపారు.