కాబూల్ : చెప్పిన సమయానికి ముందే యూఎస్ మిలిటరీ ఆఫ్ఘనిస్తాన్‌ను వీడింది. తాలిబాన్‌తో చేసుకున్న ఒప్పందం మేరకు ఆగస్టు 31 లోపు ఆఫ్ఘనిస్తాన్‌ను పూర్తిగా వదులుకోవాల్సి ఉన్నది. అయితే, 24 గంటల క్రితమే అమెరికా, నాటో దళాలు (US Army) ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెళ్లిపోయాయి. కాబూల్ విమానాశ్రయం నుంచి నాలుగు యూఎస్ మిలిటరీ ట్రాన్స్పోర్ట్ విమానాలు సీ-17 బయల్దేరడంతో తాలిబాన్ ఫైటర్లు సంబరాల్లో మునిగిపోయారు. బాణాసంచాతోపాటు తుపాకీ కాల్పులు జరిపారు.
అయితే, అమెరికా మిలిటరీ వెళ్లిపోతూ తమ ఆయుధ సంపత్తి తాలిబాన్ చేతుల్లోకి వెళ్లకుండా ఎక్కడికక్కడ ధ్వంసం చేసినట్లు తెలుస్తున్నది. అమెరికా వదిలిపెట్టిన దాదాపు 73 విమానాలను తాలిబాన్ ఎప్పటికీ వినియోగించలేని విధంగా నాశనం చేసినట్లుగా ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
కాబూల్‌లోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిలిపి ఉంచిన 73 తేలికపాటి విమానాలు, హెలీకాప్టర్లను అక్కడే వదిలేసినట్లు సెంట్రల్ కమాండ్ అధిపతి జనరల్ కెన్నెత్ మెకెంజీ తెలిపారు. ‘ఈ విమానాలు ఇక ఎప్పటికీ ఎగరవు. ఎవరూ వాటిని ఆపరేట్ చేయలేరు. ఈ విమానాలు చాలావరకు మిషన్ కోసం సిద్ధం కానప్పటికీ, ఇంకా ఎవరూ వాటిని వినియోగించలేరు. యుఎస్ మిలిటరీ దాదాపు 70 మైన్ రెసిస్టెన్స్ అంబుష్ ప్రొటెక్షన్ (ఎంఆర్ఏపీ) వాహనాలను కూడా విమానాశ్రయంలో వదిలిపెట్టింది. అలాగే హైటెక్ రాకెట్ డిఫెన్స్ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేశారు’ అని మెకెంజీ చెప్పారు.
ఈ వాహనాలు ఐఈడీలతో దాడులు తట్టుకొని నిలువగలవు. ఒక్కో వాహనం ధర 1 మిలియన్ డాలర్ల వరకు ఉంటుందని అధికారులు చెప్తున్నారు. ఈ వాహనాలు, ఆయుధాలు తాలిబాన్ చేతుల్లోకి వెళ్లకుండా ఉండేందుకు అమెరికా సైన్యం వాటిని డిసేబుల్ చేసినట్లుగా సమాచారం.
VIDEO: US military disabled aircraft before leaving Kabul airport.
— AFP News Agency (@AFP) August 31, 2021
Taliban's 'Badri 313' special forces unit are seen on the tarmac Tuesday morning pic.twitter.com/Z7zCzGsZGY
భారత్‌లో పెరిగిన ఆర్-వ్యాల్యూ.. వేగంగా కొవిడ్ వ్యాప్తి
20 ఏండ్ల తర్వాత ఆఫ్ఘన్ చేరాడు.. ఎవరంటే..?
తాలిబాన్ దేశాన్ని ప్రపంచం గుర్తించాలి.. లేదంటే మరో 9/11 ఘటన తప్పదు: పాక్ ఎన్ఎస్ఏ
పాకిస్తాన్లో శ్రీకృష్ణుడి ఆలయం ధ్వంసం
ఏడేండ్ల వయసు వరకు పిల్లలకు పరీక్షలు రద్దు
ఖలిస్తానీ దాడి : సీఎం బియాంత్ సింగ్ దారుణహత్య
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..