హొర్ముజ్‌లో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ ఓడరేవుపై యూఎస్ దాడులు
ఇరాన్-అమెరికా యుద్ధం ముగిసిందని ప్రపంచం ఊపిరి తీసుకునేలోపే మళ్లీ ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. మొన్న హొర్ముజ్‌లో ఓ కార్గో షిప్ మీద ఇరాన్ డ్రోన్ దాడి చేసిన ఘటన రెండు దేశాల మధ్య మళ్లీ ఉద్రిక్తతలను పెంచేశాయి.
- ప్రతిగా బహ్రెయిన్‌పై టెహ్రాన్ దాడులు
టెహ్రాన్: ఇరాన్-అమెరికా యుద్ధం ముగిసిందని ప్రపంచం ఊపిరి తీసుకునేలోపే మళ్లీ ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. మొన్న హొర్ముజ్‌లో ఓ కార్గో షిప్ మీద ఇరాన్ డ్రోన్ దాడి చేసిన ఘటన రెండు దేశాల మధ్య మళ్లీ ఉద్రిక్తతలను పెంచేశాయి. ఈ లోపు ఇరాన్ ఓడరేవుపై శనివారం అమెరికా బలగాలు దాడి చేయడం తీవ్ర కలకలం రేపింది. ఒప్పంద పత్రంపై రెండు దేశాలు సంతకాలు చేసిన తర్వాత.. తుది చర్చలు జరగడానికి ముందు ఈ దాడులు కలకలం రేపుతున్నాయి.
అయితే అమెరికా దాడులను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. హొర్ముజ్ జల సంధి సమీపంలోని సిరిక్ నగరంలోని ఓడరేవు వద్ద ఓ క్షిపణి దాడి జరిగినట్టు ఇరాన్ వెల్లడించింది. అమెరికా జరిపిన దాడులకు ప్రతీకారంగా ఇరాన్ సమీపంలోని బహ్రెయిన్‌పై డ్రోన్ దాడికి దిగింది. అనేక డ్రోన్లు తమ దేశంపై దాడి చేశాయని బెహ్రెయిన్ ప్రకటించింది. కాగా, ఇరాన్ డ్రోన్ దాడికి ప్రతిగానే తాము ఈ దాడులు చేసినట్టు యూఎస్ వైస్ ప్రెసిడెంట్ వాన్స్ చెప్పారు. దాడులు ప్రతిదాడులను ప్రోత్సహిస్తాయన్నారు.
లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు..
ఇంకోవైపు లెబనాన్ మీద ఇజ్రాయెల్ దాడులు తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీస్తున్నాయి. అమెరికా మధ్యవర్తిత్వంతో లెబనాన్, ఇజ్రాయెల్ మధ్య తాజాగా కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం పూర్తిగా అమల్లోకి రాకముందే దక్షిణ లెబనాన్‌లోని నబాటియే ప్రాంతంపై ఇజ్రాయెల్ దాడులు జరిపింది. దీంతో ఒప్పందాన్ని ఈ దాడులు ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయని లెబెనాన్ అధికారులు అంటున్నారు. రెండు దేశాల సరిహద్దు వెంబడి పదే పదే కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనకు గురవుతోంది. ఈ దాడులను ఇరాన్ తీవ్రంగా ఖండిస్తూ ఒప్పంద ఉల్లంఘనను వ్యతిరేకించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Bahrain
- iran
- Tehran
- US airstrikes
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

