ఐక్యరాజ్యసమితి : పాకిస్థాన్లోని లష్కరే తాయిబా అనుబంధ ఉగ్రవాద సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్)కు ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి షాక్ ఇచ్చింది. ఉగ్రవాదులు ఏప్రిల్ 22న పహల్గాంలో 26 మందిని హత్య చేశారు. ఈ దాడి వెనుక టీఆర్ఎఫ్ ఉందని మండలి నివేదిక పేర్కొంది. టీఆర్ఎఫ్ను యూఎన్ఎస్సీ ఈ విధంగా పేర్కొనడం ఇదే మొదటిసారి.
ఐరాస డాక్యుమెంట్లో టీఆర్ఎఫ్ ప్రస్తావన రావడం కూడా ఇదే తొలిసారి. పహల్గాం దాడిని ఖండించేటపుడు టీఆర్ఎఫ్ పేరును యూఎన్ఎస్సీ ప్రస్తావించే విధంగా చేయడానికి భారత దేశం చేసిన ప్రయత్నాలను పాకిస్థాన్ అడ్డుకుంటూ వస్తున్నది.