ఐక్య రాజ్య సమితి, జూలై 23 : వాతావరణ మార్పుల వల్ల పర్యావరణం దెబ్బతినకుండా కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వాలపైనే ఉందని అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) బుధవారం స్పష్టం చేసింది. 500కుపైగా పేజీలుగల ఈ సలహాపూర్వక అభిప్రాయం నేపథ్యంలో అంతర్జాతీయ వాతావరణ సంబంధిత చట్టాలపై పెను ప్రభావం పడుతుందని విశ్లేషకులు చెప్పారు.
పరిశుభ్రమైన, ఆరోగ్యవంతమైన, సుస్థిర పర్యావరణాన్ని మానవ హక్కుగా పేర్కొన్నందు వల్ల చట్టపరమైన చర్యలు చేపట్టడానికి మార్గం సుగమం అవుతుందన్నారు. వివిధ దేశాల ప్రభుత్వాలు ఇతర దేశాల ప్రభుత్వాలపై ఐసీజేలో కేసులు పెట్టడానికి వీలవుతుందని వివరించారు.