మరిన్ని రాకెట్ లాంఛర్లు పంపండి!
- పశ్చిమ దేశాలను కోరిన జెలెన్స్కీ
- రష్యా దురాక్రమణను మరింత వేగంగా తిప్పికొట్టేందుకు సహకరించాలని విజ్ఞప్తి
కీవ్, మే 27: డాన్బాస్ రీజియన్లో రష్యా దురాక్రమణను సమర్థంగా తిప్పికొట్టేందుకు మల్టిపుల్ లాంచ్ రాకెట్ వ్యవస్థ(ఎంఎల్ఆర్ఎస్)లను పంపాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పశ్చిమదేశాలను కోరారు. గురువారం రాత్రి ఆయన జాతినుద్దేశించి మాట్లాడుతూ ప్రస్తుతం అందుబాటులో ఉన్న అన్ని ఆయుధాలతో పోరాడుతున్నామని, ఆక్రమణదారులను తరిమికొట్టేందుకు మరింత వేగంగా, విశ్వాసంతో ముందుకు వెళ్లాలని అనుకుంటున్నామని, ఇందుకు అత్యాధునిక ఆయుధాలు పంపి సహకరించాలని అన్నారు.
రష్యా బలగాలు ఉక్రెయిన్ తూర్పు పట్టణాలను నాశనం చేస్తున్నాయని, మరియుపోల్, వోల్నోవాఖా పట్టణాల మాదిరిగా పొపస్నా, బక్ముత్, లైమాన్, లైసిచాన్స్, తదితర ప్రాంతాలను కూడా బూడిద చేయాలని అనుకుంటున్నాయని అన్నారు. యుద్ధ నేరాల కింద మరో ఇద్దరు రష్యా సైనికులపై ఉక్రెయిన్ విచారణ చేస్తున్నది. ఫిన్లాండ్ ప్రధాని సన్నా మారిన్ గురువారం ఉక్రెయిన్లో పర్యటించారు. జెలెన్స్కీతో భేటీ అయ్యారు.
సీవీరోడోనెట్స్ పట్టణం విధ్వంసం
లుహాన్స్ రీజియన్లోని సీవీరోడోనెట్స్ పట్టణంలో రష్యా బలగాలు విధ్వంసం సృష్టించాయని మేయర్ ఒలెక్సాండర్ స్ట్రియుక్ పేర్కొన్నారు. ఇప్పటి వరకు దాదాపు 1500 మంది పౌరులు చనిపోయారని, 60 శాతం నివాస భవనాలు ధ్వంసమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు తూర్పు డొనెట్స్ రీజియన్లోని వ్యూహాత్మక పట్టనం లిమాన్ను స్వాధీనం చేసుకున్నట్టు రష్యా మద్దతు గల వేర్పాటువాద బలగాలు శుక్రవారం ప్రకటించాయి. జెలెన్స్కీ సలహాదారు ఒలెక్సీ కూడా ధ్రువీకరించారు.
వాళ్లే ఇబ్బందులు పడతారు:పుతిన్
రష్యాను ప్రపంచం ముందు ఏకాకి చేసేందుకు పశ్చిమ దేశాలు చేస్తున్న ప్రయత్నాలు విఫలమౌతాయని ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ అన్నారు. అటువంటి ప్రయత్నాలు చేసే వారే దెబ్బతింటారని, పెరుగుతున్న ఆర్థిక సమస్యలను ఎదుర్కోవడంలో ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. యురేషియన్ ఎకనమిక్ ఫోరమ్ను ఉద్దేశించి గురువారం వీడియో లింక్లో మాట్లాడుతూ పశ్చిమ దేశాలు ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, ఆహార సమస్య, తదితర సమస్యలు ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

