కీవ్: ఉక్రెయన్‌పై రష్యా ఆక్రమణకు వెళ్లిన తర్వాత అక్కడ పరిస్థితులు దయనీయంగా మారాయి. రష్యాను ఎదుర్కొనేందుకు కొన్ని యూరోప్ దేశాలు ఉక్రెయిన్‌కు ఆయుధాలు సరఫరా చేస్తున్న విషయం తెలిసిందే. బ్రిటన్ కూడా ఆ దేశాన్ని కొన్ని మిస్సైళ్లను పంపింది. వాటిల్లో సర్ఫేస్ టు ఎయిర్‌కు చెందిన జావెలిన్ మిస్సైళ్లు ఉన్నాయి. అయితే ఇటీవల ఉక్రెయిన్‌లో జన్మించిన పిల్లలకు కొందరు ఆ మిస్సైళ్ల పేరును పెట్టుకున్నారు. దీనికి సంబంధించి ఉక్రెయిన్ మీడియా కొన్ని కథనాలను రాసింది. ఓ అబ్బాయికి యన్ జావెలిన్ అని నామకరణం చేయగా, ఓ అమ్మాయికి జావెలినా అని పేరు పెట్టినట్లు తెలుస్తోంది. పశ్చిమ ప్రాంత నగరమైన విన్నిసియా ప్రభుత్వ కార్యాలయంలో ఈ పేర్లతో రిజిస్ట్రేషన్ జరిగినట్లు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఉక్రెయిన్‌కు పశ్చిమ దేశాలు ఆయుధాలు సరఫరా చేశాయని, దానికి కృతజ్ఞతగా క్షిపణుల పేర్లను పెడుతున్నట్లు ఆ దేశ మాజీ ఫస్ట్ లేడీ కటేరినా యుషచెంకో తెలిపారు.