Watch: రష్యాను హడలెత్తిస్తున్న ఉక్రెయిన్ డ్రోన్లు… ఆర్మీ హెలికాప్టర్ పేల్చివేత
కీవ్: ఉక్రెయిన్ డ్రోన్లు రష్యాను హడలిస్తున్నాయి. బైరక్టార్ టీబీ-2 డ్రోన్లు రష్యా ఆర్మీకి తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. తాజాగా రష్యా మి-8 హెలికాప్టర్‌ను ఉక్రెయిన్ డ్రోన్ పేల్చివేసింది. నల్ల సముద్రంలో రష్యా స్వాధీనం చేసుకున్న ఉక్రెయిన్‌కు చెందిన కీలకమైన స్నేక్ ఐలాండ్‌లో ఈ ఘటన జరిగింది. ఆ ఐలాండ్‌కు సైనికులను చేరవేస్తున్న రష్యా హెలికాప్టర్‌ను ఉపగ్రహ నియంత్రిత డ్రోన్ ధ్వంసం చేసింది. దీనికి సంబంధించిన వీడియోను ఉక్రెయిన్ వెపన్స్ ట్రాకర్ ట్విట్టర్ ఖాతాలో ఆదివారం పోస్ట్ చేసింది. ‘ఉక్రెయిన్ టీబీ-2 డ్రోన్లు స్నేక్ ఐలాండ్‌లో రష్యా దళాలపై దాడిని కొనసాగిస్తున్నాయి. రష్యా సైనికులు దిగుతున్న సమయంలోనే మి-8 హెలికాప్టర్‌ను ధ్వంసం చేసింది’ అని అందులో పేర్కొంది. ఇటీవల నల్ల సముద్రంలోని రష్యా యుద్ధ నౌకపై కూడా ఉక్రెయిన్ డ్రోన్ బాంబు దాడి చేసింది. దీంతో ఆ యుద్ధ నౌక ధ్వంసమైంది.
మరోవైపు స్నేక్ ఐలాండ్‌లోని రష్యా సైనిక శిబిరాలపై ఉక్రెయిన్ ఎస్‌యూ-27 యుద్ధ విమానాలు వైమానిక దాడులు చేశాయి. టీబీ-2 డ్రోన్ ద్వారా తీసిన ఈ వీడియో క్లిప్‌ను కూడా ఉక్రెయిన్ వెపన్స్ ట్రాకర్ ట్వీట్ చేసింది. ఉక్రెయిన్ ఎయిర్ ఫోర్స్ ఇంకా క్రీయాశీలకంగానే ఉన్నదని తెలిపింది. రెండు ఎస్‌యూ-27 ఫైటర్ జెట్లు రష్యా ఆర్మీ కేంద్రాలపై బాంబులు వేశాయని, చాలా నష్టం కలిగించాయని పేర్కొంది.
#Ukraine: Ukrainian TB-2 drones continue to strike Russian forces on Snake Island.
This time, an Mi-8 helicopter was destroyed, just as troops were disembarking. pic.twitter.com/Y7MO4MiQRN
— Polymarket Intel (@PolymarketIntel) May 8, 2022
#Ukraine: The Ukrainian Air force is still alive- seen here are two Ukrainian Su-27 striking Russian facilities on the famous Snake Island in the Black Sea, in remarkable footage filmed by a TB-2 drone.
As we can observe, there is serious damage. pic.twitter.com/ogN3gOU8uJ
— Polymarket Intel (@PolymarketIntel) May 7, 2022
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

