రష్యాపై ఉక్రెయిన్ సంచలన ఆరోపణలు చేసింది. లుహాస్సక్ ప్రాంతంలోని ఓ గ్రామంపై రష్యాకు మద్దతిచ్చే వేర్పాటువాదులు మోర్టార్ షెల్స్‌తో దాడులకు దిగుతున్నారని ఉక్రెయిన్ ఆరోపిస్తోంది. కిండర్గార్ను లక్ష్యంగా చేసుకొని విరుచుకుపడుతున్నారని పేర్కొంది. తూర్పు ఉక్రెయిన్‌లోని కాల్పుల విరమణ రేఖ వద్ద రష్యాను సమర్థించే విద్రోహులు దాడులకు దిగుతున్నారని ఆరోపిస్తున్నారు. లక్షకు పైగా రష్యా సైనికులు తమ సరిహద్దుల వద్ద మోహరించి వున్నారని, యుద్ధానికి దిగే అవకాశాలున్నాయని ఉక్రెయిన్ పేర్కొంటోంది. 24 గంటల్లో నాలుగు సార్లు దాడులు చేశారని ఆరోపిస్తున్నారు.