కీవ్: మారిపోల్ నగరంలో జరిగిన భీకర పోరులో రష్యా జనరల్ హతమైనట్లు ఉక్రెయిన్ ఆర్మీ చెప్పింది. ఈ యుద్ధంలో రష్యా నాలుగవ జనరల్‌ను కోల్పోయినట్లు అజోవ్ ఆర్మీ తెలిపింది. మారిపోల్ దాడి సమయంలో మేజర్ జనరల్ ఓలేగ్ మిత్యేవ్ హతమైనట్లు ఉక్రెయిన్ హోంశాఖ వెల్లడించింది. జనరల్ ఓలేగ్కు చెందిన ఫోటోను టెలిగ్రామ్‌లో షేర్ చేశారు. జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో జనరల్ మరణం గురించి జెలెన్స్కీ తెలిపారు. 46 ఏళ్ల మిత్యేవ్.. 150వ రైఫిల్ డివిజన్‌కు కమాండర్‌గా ఉన్నారు. సిరియా యుద్ధంలోనూ ఆయన పోరాడారు. జనరల్ మిత్యేవ్ మృతి పట్ల రష్యా ఇంకా ప్రకటన చేయలేదు.