కీవ్ : ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. కీలక నగరాలపై పట్టు బిగిస్తూ రష్యన్ సేనలు ఉక్రెయిన్‌పై విరుచుకుపడుతున్నాయి. అయితే రష్యా దమనకాండకు దీటుగా బదులిస్తున్నామని ఉక్రెయిన్ సాయుధ బలగాలు స్పష్టం చేశాయి. ఇప్పటివరకూ 250 రష్యన్ ట్యాంకులను ధ్వంసం చేశామని, 10,000 మంది రష్యన్ సైనికులను మట్టుబెట్టామని ఉక్రెయిన్ ఆర్మీ తెలిపింది.
రష్యా వైపు భారీ నష్టం వాటిల్లిందని పేర్కొంది. 33 విమానాలు, 37 రష్యన్ హెలికాఫ్టర్లను కూల్చామని తెలిపింది. 939 సాయుధ క్యారియర్లను ధ్వంసం చేశామని, 60 ఫ్యూయల్ ట్యాంకులను పేల్చివేశామని, 18 యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ వార్ఫేర్ను ధ్వంసం చేశామని తెలిపింది. ఇక జపోరిజియా అణు శక్తి కేంద్రాన్ని రష్యా దళాలు స్వాధీనం చేసుకున్నట్లు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు.
గురువారం రష్యా చేసిన దాడిలో జపోరిజియా ప్లాంట్ ప్రమాదానికి గురైంది. ఫైరింగ్ వల్ల ఆ ప్లాంట్‌లో మంటలు వ్యాపించిన విషయం తెలిసిందే. అయితే ఆ మంటల్ని ఫైర్‌ఫైటర్స్ ఆపినట్లు ఇవాళ తెలిపారు. న్యూక్లియర్ ప్లాంట్‌లో ఉన్న పవర్ యూనిట్లను అక్కడే ఉన్న సిబ్బంది మానిటర్ చేస్తున్నారని స్థానికులు తెలిపారు. ప్లాంట్ దాడిలో రియాక్టర్ నెంబర్ వన్‌లో స్వల్పంగా డ్యామేజ్ జరిగినట్లు అధికారులు తెలిపారు.