ఉక్రెయిన్‌పై రష్యా దాడులు చేస్తూనే వుంది. మురియుపోల్ తమ వశమైందని రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించిన నేపథ్యంలో అమెరికా మంత్రులు కీవ్‌కు రానున్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వీరితో భేటీ కానున్నారు. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింటన్, రక్షణ మంత్రి లాయిడ్ యాస్టిన్తో జెలెన్స్కీ చర్చలు జరపనున్నారు.
అయితే వీరిద్దరి భేటీపై అమెరికా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే ఈ భేటీలో తమకు అధిక ఆయుధాలు కావాలని జెలెన్స్కీ అమెరికా నేతలను కోరనున్నారు. ఎక్కువ ఆయుధాలను తమకు ఇస్తే, రష్యా చేతుల్లోకి వెళ్లిన తమ భూభాగాలను తిరిగి స్వాధీనం చేసుకుంటామని జెలెన్స్కీ అమెరికా నేతలను కోరనున్నారు.
ఉక్రెయిన్ ఆక్రమణలో అత్యంత కీలక నగరమైన మరియుపోల్ రష్యా వశమైంది. యుద్ధం ప్రారంభించిన దాదాపు నెల రోజుల తర్వాత రష్యా అతి కష్టమ్మీద గురువారం ఈ నగరాన్ని చేజిక్కించుకొన్నది. ఈ విషయాన్ని రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. ‘నగరానికి స్వేచ్ఛ కల్పించడంలో విజయం సాధించాం’ అని వ్యాఖ్యానించారు.