కీవ్ : డ్రోన్లతో విరుచుకుపడుతున్న రష్యాకు గట్టి బుద్ధి చెప్పేందుకు ఉక్రెయిన్ సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నది. డ్రోన్లను కూల్చడానికి సైన్యానికి బదులుగా స్వచ్ఛంద కార్యకర్తలను వినియోగించుకోవాలని నిర్ణయించింది. రష్యా నుంచి వచ్చే డ్రోన్లను కూల్చేవారికి ఒక్కొక్కరికి నెలకు రూ.2.2 లక్షలు చొప్పున చెల్లిస్తామని ఉక్రెయిన్ ప్రభుత్వం ప్రకటించింది.
ఈ పథకానికి మంత్రివర్గ ఆమోదం లభించిందని ప్రభుత్వ ప్రతినిధి తారస్ మెల్నిచుక్ మీడియాకు చెప్పారు. శిక్షణ పొందిన వాలంటీర్లు, డ్రోన్ ఆపరేషన్లో నైపుణ్యంగల పారామిలిటరీ సిబ్బంది మానవ రహిత వాహనాలు, ఆయుధాలతో రష్యన్ డ్రోన్లను కూల్చవలసి ఉంటుంది.