రష్యాపై 1000 డ్రోన్లతో దాడి
తమ దేశ రాజధాని మాస్కోపై మూడేండ్ల కాలంలో ఉక్రెయిన్ అతి పెద్ద డ్రోన్ దాడికి పాల్పడిందని రష్యన్ ప్రభుత్వ న్యూస్ ఏజెన్సీ టస్ తెలిపింది. ఈ దాడిలో కీలక చమురు శుద్ధి కేంద్రం దెబ్బతిందని.. నగరంలో పలుచోట్ల మంటలు చెలరేగాయని పేర్కొన్నది. చమురు శుద్ధి కేంద్రం నుంచి కొన్ని మీటర్ల ఎత్తు వరకు మంటలు, పొగలు వెలువడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో కనిపించాయి.
- విరుచుకుపడ్డ ఉక్రెయిన్
- మాస్కోలో ఎయిర్పోర్టుల మూసివేత
మాస్కో: తమ దేశ రాజధాని మాస్కోపై మూడేండ్ల కాలంలో ఉక్రెయిన్ అతి పెద్ద డ్రోన్ దాడికి పాల్పడిందని రష్యన్ ప్రభుత్వ న్యూస్ ఏజెన్సీ టస్ తెలిపింది. ఈ దాడిలో కీలక చమురు శుద్ధి కేంద్రం దెబ్బతిందని.. నగరంలో పలుచోట్ల మంటలు చెలరేగాయని పేర్కొన్నది. చమురు శుద్ధి కేంద్రం నుంచి కొన్ని మీటర్ల ఎత్తు వరకు మంటలు, పొగలు వెలువడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో కనిపించాయి. తమ దేశ వైమానిక దళం 194 డ్రోన్లను కూల్చివేసిందని మాస్కో మేయర్ సెర్గీ సొబ్యనిన్ తెలిపారు.
దాడి కారణంగా మాస్కోలోని పెద్ద విమానాశ్రయాల్లో విమానాల రాకపోకలను నిలిపేశారు. ఉక్రెయిన్ సుమారు 1000 డ్రోన్లతో, 4 క్రూయిజ్ మిసైళ్లతో రాత్రివేళ రష్యా వ్యాప్తంగా దాడికి పాల్పడింది. దౌత్య ఒప్పందం కోసం ఒత్తిడి తీసుకు రావడానికే ఈ దాడి చేసినట్టు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. ‘మా దేశం తగలబడితే, మీ మాస్కో కూడా తగలబడుతుంది’ అని ఆయన రష్యాను హెచ్చరించారు. తమ దాడికి స్పందనగా రష్యా ఏడు క్షిపణులను, 239 డ్రోన్లను తమ దేశంపై ప్రయోగించిందని ఉక్రెయిన్ తెలిపింది. కీవ్, పొల్టావా ప్రాంతాల్లోని చమురు కేంద్రాలపై దాడి చేసినట్టు రష్యా రక్షణ శాఖ ధ్రువీకరించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- largest attack
- Moscow
- Ukraine
- war
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
Bathukamma Celebrations | మలేషియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
పత్రికా స్వేచ్ఛ పేరుతో నిరాధార ఆరోపణలు తగవు: బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ ప్రతినిధి శ్రీధర్
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

