Ukraine invasion | ఉక్రెయిన్పై సైనిక చర్యకు దిగిన రష్యాపై అమెరికా పరిమిత ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించింది. ఉక్రెయిన్లోని రెండు రష్యా అనుకూల ప్రాంతాల్లోకి రష్యా సేనలు మంగళవారం ప్రవేశించాయి. దీంతో రష్యాపై పరిమిత ఆంక్షలు విధిస్తున్నట్లు అమెరికా తెలిపింది. ఉక్రెయిన్లోకి పూర్తిస్థాయిలో చొరబాటుకు పాల్పడితే మరింత అసాధారణ ఆంక్షలు అమల్లోకి తీసుకొస్తామని వాషింగ్టన్ స్పష్టం చేసింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. అమెరికాతోపాటు దాని మిత్ర దేశాల కూటమి నాటో.. రష్యా చర్యను ఖండించింది.
ఉక్రెయిన్లోని డోన్బాస్ రీజియన్ పరిధిలోని రెండు ప్రాంతాలను స్వతంత్ర దేశాలుగా గుర్తిస్తున్నట్లు రష్యా ప్రకటించి, వారితో భద్రతా సహాకార ఒప్పందం కుదుర్చుకున్నది. వారికి మద్దతుగా పీస్ కీపర్లను పంపుతున్నట్లు ప్రకటించింది. దీంతో ఉక్రెయిన్పై రష్యా పూర్తిగా దండయాత్రకు దిగిందని అమెరికా ఆరోపించింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ తమ కండ్లు కప్పేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొంది. ఉక్రెయిన్ సరిహద్దుల్లో 1.50 లక్షల మంది సైనికులను బరిలో నిలిపింది.